Cloves Benefits: లవంగాలతో ఎన్ని ప్రయోజనాలో.. కనీసం మీ ఊహకు కూడా అందవు

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి లేని పోపుల డబ్బా ఉండనే ఉండదు. అటు మసాలా కూరలతో..

Cloves Benefits: లవంగాలతో ఎన్ని ప్రయోజనాలో.. కనీసం మీ ఊహకు కూడా అందవు
cloves
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 4:22 PM

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి లేని పోపుల డబ్బా ఉండనే ఉండదు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీనిని నార్మల్‌గా కూడా తింటారు. ఎందుకంటే లవంగం వంటల్లో రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. లవంగాల్ని కూరలతోపాటూ… కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారు. అయితే ఈ లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం.

లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలు…

* లవంగాలను తినడం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. * దంత సమస్యలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలను పొడిగా చేసి ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. * నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తే.. రెండు మూడు లవంగాలు నమిలితే చాలు.. ఆ దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు * కొందరికి దూర ప్రయాణాలు చేయడం పడదు. ప్రయాణాల్లో మధ్యలోనే వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి వారి సమస్యను కూడా లవంగాలతో చెక్ పెట్టొచ్చు. ప్రయాణానికి ముందు ఓ రెండు లవంగాలు తీసుకుంటే సరి. తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటుగా.. వికారం లాంటివి పోతాయి. దీంతో ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. * ఇక వర్షంలో తడిసినా.. చల్లని పదార్థాలు, స్వీట్లు తీసుకున్నా.. చాలా మందికి వెంటనే జలుబు, దగ్గు పట్టేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో రోజులో ఓ అయిదు లవంగాలను తీసుకుంటే.. త్వరగా ఉపశమనం కలుగుతుంది.

* అంతేకాదు.. ఇవి వ్యాధుల్ని నియంత్రిచడంలో కూడా పనిచేస్తాయి. శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి. * రెగ్యులర్‌గా తలనొప్పి వచ్చేవారు.. లవంగాలను తినడం ద్వారా రిలీఫ్ పొందవచ్చు. అంతేకాదు ఇది బీపీని, షుగర్‌ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌‌లో ఉంచుతాయి. * లివర్, స్కిన్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు * లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. దీని ద్వారా నొప్పి, వాపు, మంటల్ని తగ్గిస్తుంది. * అల్సర్ సమస్యలకు కూడా లవంగాలతో ఉపశమనం పొందవచ్చు.

అయితే మితంగా కాకుండా.. అదే పనిగా వీటిని తింటే ఇబ్బందులు తప్పవు. ఎక్కువగా తింటే నోరు పాడయ్యే అవకాశం ఉంది. రోజుకు నాలుగైదు కంటే మించకుండా తీసుకోవాలి. పిల్లలకు వీలైనంత తక్కువగా ఇస్తే మంచిది.

( నోట్: ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఏదైనా అనుమానాలు, సమస్యలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

Read Also: బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

ఆ చేప నోట్లో మనిషి ‘పళ్ళు’..అమెరికాలోని జాలరికి లభించిన అరుదైన మత్స్యం

తూర్పుగోదావరి జిల్లాలో వింత.. కోడిపెట్టే కాదు కోడిపుంజు కూడా గుడ్డు పెడుతుంది..

రైల్లో ప్రాంక్ చేశాడు.. ఆ తరువాత అడ్డంగా బుక్కయ్యాడు.. ఏకంగా రెండేళ్లు..

MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..