Prank in Train: రైల్లో ప్రాంక్ చేశాడు.. ఆ తరువాత అడ్డంగా బుక్కయ్యాడు.. ఏకంగా రెండేళ్లు..
Prank in Train: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు ఎక్కవుగా అవుతున్నాయి. ప్రాంక్ పేరుతో ప్రజలను ఫూల్స్ చేయడం.. వారిని ఆట పట్టించడం..
Prank in Train: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు ఎక్కవుగా అవుతున్నాయి. ప్రాంక్ పేరుతో ప్రజలను ఫూల్స్ చేయడం.. వారిని ఆట పట్టించడం.. ఆపై ప్రాంక్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం. అయితే, ఈ ప్రాంక్ వీడియోల్లో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని సీరియస్‌గా ఉంటున్నాయి. తాము పాపులారిటీ అవ్వడం కోసం ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇలాగే ప్రాంక్ పేరుతో ఇతరులను ఇబ్బందులకు గురి చేసిన యువకుడికి చుక్కలు చూపించారు అధికారులు. తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఈ సంఘటన రష్యాలో వెలుగు చూసింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాలో కారోమాటులో నుంచి ఝూబోరోవ్‌కు వెళ్తున్న మెట్రో ట్రైన్‌లో ఓ యువకుడు ఎక్కాడు. మెట్రో బోగీలన్నీ ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న యువకుడు.. ఒక్కసారిగా విపరీతంగా దగ్గుతూ గుండెపట్టుకుని కింద పడిపోయాడు. అసలే కరోనా వణికిస్తున్న సమయంలో యువకుడు దగ్గుతూ కింద పడిపోవడంతో.. ప్యాసింజర్స్ హడలిపోయారు. మెట్రో రైల్ ఆగడమే ఆలస్యం.. ప్రయాణికులంతా బయటకు పరుగులు తీశారు. అయితే, ఇదంతా ప్రాంక్ అంటూ ఆ యువకుడు సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారి.. అధికారుల కంట పడింది. ప్రాంక్ చేసిన యువకుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు అక్కడి పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ప్రాంక్ పేరుతో జనాలకు ఇబ్బందులకు గురిచేసిన యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
Also read:
Kajol Birthday: సాహసం చేసిన కాజోల్.. ఒకవేళ పట్టు తప్పితే హీరోయిన్గా ఉండడం కష్టమేనట..
Suicide: ఖమ్మం జిల్లా పోలీసు విభాగంలో విషాదం.. ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా..!