Suicide: ఖమ్మం జిల్లా పోలీసు విభాగంలో విషాదం.. ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా..!

ఖమ్మం జిల్లా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇల్లెందులో పోలీసు కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు గురువారం ఆత్మహత్య.

Suicide: ఖమ్మం జిల్లా పోలీసు విభాగంలో విషాదం.. ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా..!
Boyfriend Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 05, 2021 | 11:04 AM

Kothagudem Police constable Suicide: ఖమ్మం జిల్లా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇల్లెందులో పోలీసు కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాంబాబు ప్రస్తుతం కొత్తగూడెం టీఎస్‌పీఎస్‌సీలో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.

ఇటీవల రాంబాబు కుటుంబంలో చిన్న పాటి గొడవ చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య తగువులాట పోలీసులు కేసుల దాకా వెళ్లింది. దీంతో అతనిపై భార్య వేధింపుల కేసు పెట్టింది. ఏడాది నుంచి విధులకు వెళ్లకుండా వేధిస్తున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌ రాంబాబుపై కేసు నమోదైంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రాంబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Read Also….  Tamil Nadu: దేవాలయ భూముల కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. తంజావూర్‌ జిల్లాలో ఉద్రిక్తత..!