AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: దేవాలయ భూముల కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. తంజావూర్‌ జిల్లాలో ఉద్రిక్తత..!

తమిళనాడులోని తంజావూర్ జిల్లా ఒరతనాడులో ఉద్రిక్తత నెలకొంది. దేవాలయానికి చెందిన భూముల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ దాడులకు దారితీసింది.

Tamil Nadu: దేవాలయ భూముల కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. తంజావూర్‌ జిల్లాలో ఉద్రిక్తత..!
Clashes In Tamil Nadu
Balaraju Goud
|

Updated on: Aug 05, 2021 | 11:29 AM

Share

Orathanadu Clashes in Tamil Nadu: తమిళనాడులోని తంజావూర్ జిల్లా ఒరతనాడులో ఉద్రిక్తత నెలకొంది. దేవాలయానికి చెందిన భూముల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ దాడులకు దారితీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి..వీరిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు చెందిన నేతలఫై కేసు నమోదు చేశారు.

అయ్యనార్ దేవాలయానికి చెందిన భూముల వివాదంలో గత కొన్నిరోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో గురువారం ఉదయం ఇరు వర్గాల మద్య ఘర్షణలు జరుగుతున్నాయి. భూములు తమవే అంటోంది పళనివెల్ కుటుంబం పట్టుబడుతుంటే.. ఆలయ భూములు గ్రామానికి చెందినవి అని గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. ఇదే విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడి దాడులు చేసుకున్నారు. కత్తులతో దాడి చేసుకోవడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రెండు గ్రూపులను చెదరగొట్టడంతో గొడవ సర్ధమణిగింది. అనంతరం ఇరు వర్గాలకు చెందిన నేతలఫై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also…  Suicide: భార్య భర్తల మధ్య చిన్న గొడవ.. ఆతర్వాత అన్ని అపశకునాలే.. ఆయుష్షు తీరిందని ఆత్మహత్య