Suicide: భార్య భర్తల మధ్య చిన్న గొడవ.. ఆతర్వాత అన్ని అపశకునాలే.. ఆయుష్షు తీరిందని ఆత్మహత్య

తన ఆయుష్షు తీరిందని ఆమె భావించింది. అంతే.. సెల్ఫీ వీడియో తీసుకొని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్​మహానగరంలో చోటుచేసుకుంది.

Suicide: భార్య భర్తల మధ్య చిన్న గొడవ.. ఆతర్వాత అన్ని అపశకునాలే.. ఆయుష్షు తీరిందని ఆత్మహత్య
Hyderabad Selfie Suicide
Follow us

|

Updated on: Aug 05, 2021 | 10:22 AM

Hyderabad Woman Selfie Suicide: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో చిన్న గొడవ.. ఆ కోపంలో ఆత్మహత్యకు సిద్ధమైంది. ఇదే క్రమంలో దేవుడికి పూజ చేయడానికి సిద్ధపడింది.. హారతిచ్చే ప్రయత్నం చేయగా అది ఆరిపోయింది.. ముత్తయిదువగా తనువు చాలించాలని భావించి నుదుట కుంకుమ పెట్టుకొనే ప్రయత్నం చేయగా కుంకుమ భరణి చేజారింది.. ఇవి అపశకునాలేనని.. తన ఆయుష్షు తీరిందని ఆమె భావించింది. అంతే.. సెల్ఫీ వీడియో తీసుకొని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్​మహానగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఓం ప్రకాశ్‌, కబిత(23)లు ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకొన్నారు. తమ నాలుగేళ్ల కూతురుతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.78లోని పద్మాలయ అంబేడ్కర్‌నగర్‌ బస్తీలో అద్దెకుంటున్నారు. ఈ నెల 2వ తేదీన ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో ఓంప్రకాశ్‌ తాను డ్రైవింగ్‌ చేసే చోటకు కూతురిని తీసుకొని వెళ్లిపోయాడు.

డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటి వచ్చిన ఓం ప్రకాశ్.. తలుపు ఎన్నిసార్లు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతను కిటికీలో నుంచి చూశాడు. కబిత ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నపాటి గొడవ జరిగిందని, అంతకుమించి ఏమీ లేదని అతను ప్రాథమికంగా తెలిపాడు. కబిత సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారరణ చేపట్టారు. అందులోని సెల్ఫీ వీడియోల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇంటి యజమాని కిషోర్‌కుమార్‌ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also….  GHMC: రెండు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆచూకీ లభించని జీహెచ్ఎంసీ కార్మికుడి డెడ్‌బాడీ

NABARD Prelims Exam 2021: నాబార్డ్‌లో ఉద్యోగాల భర్తీ.. ప్రిలిమ్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..