AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC: రెండు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆచూకీ లభించని జీహెచ్ఎంసీ కార్మికుడి డెడ్‌బాడీ

రెండ్రోజులు గడిచిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కూడా 30గంటలు దాటిపోయింది. అయినా, హైదరాబాద్ వనస్థలిపురం దగ్గర మ్యాన్ హోల్ లో గల్లంతైన మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ మాత్రం లభించలేదు.

GHMC: రెండు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆచూకీ లభించని జీహెచ్ఎంసీ కార్మికుడి డెడ్‌బాడీ
Ghmc Workers
Balaraju Goud
|

Updated on: Aug 05, 2021 | 11:25 AM

Share

GHMC DRF rescue operation: రెండ్రోజులు గడిచిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కూడా 30గంటలు దాటిపోయింది. అయినా, హైదరాబాద్ వనస్థలిపురం దగ్గర మ్యాన్ హోల్ లో గల్లంతైన మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ మాత్రం లభించలేదు. కనిపించకుండాపోయిన డెడ్ బాడీ ఆచూకీ కోసం డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇద్దరు ప్రాణాలు తీసిన మ్యాన్‌హోల్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి డ్రైనేజీ క్లీనింగ్‌ చేసేందుకు దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు శివ, అంతయ్య గల్లంతయ్యారు. రాత్రి పూట డ్రైనేజీ క్లీన్ చేసేందుకు అనుమతి లేకున్నా కాంట్రాక్టర్ బలవంతం చేయడంతో నలుగురు మ్యాన్ హోల్‌లోకి దిగారు. ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కు‌పోవడంతో కాపాడేందుక వెళ్లి అంతయ్య కూడా ఊబిలో చిక్కుకుని ఊపిరి ఆడక చనిపోయాడు. శివ మృతదేహం లభ్యంకాగా అంతయ్య మృతదేహం కోసం రెండు రోజులుగా గాలిస్తున్నారు.

కార్మికుడు అంతయ్య డ్రైనేజీ పైప్ లైన్ లో ఇరుక్కుపోయిందనే అనుమానంతో మ్యాన్ హోల్ కు సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్నారు. రెండు భారీ జేసీబీలు, వంద మంది సిబ్బందితో పనులు చేస్తున్నారు. అయినా, ఇప్పటివరకు డెడ్ బాడీ మాత్రం దొరకలేదు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే, మృతదేహం మ్యాన్ హోల్ డ్రైనేజీలో దొరకపోతే.. ఊరి చివర ఉన్న చెరువులో వెతకాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు ఘటనపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని మండిపడుతున్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also…. పెళ్లికూతురు ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది..! ఫిట్‌నెస్‌ విషయంలో కచ్చితంగా ఉన్న వధువు…:Viral Video.

News Watch : మధ్యవర్తిత్వానికి జగన్ ఎందుకు నో చెప్పారంటే ! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )

US Accident: టెక్సాస్‌లో వలసదారులతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తా.. పది మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు