AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajol Birthday: అందానికి చిరునామా కాజోల్.. హీరోయిన్‏గానే కాదు.. విలన్‏గానూ అదుర్స్.. బర్త్ డే వేళ ఆసక్తికర విషయాలు..

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‏కు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. దాదాపు మూడు దశాబ్ధాల సినీ కెరీర్‏లో కాజోల్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో

Kajol Birthday: అందానికి చిరునామా కాజోల్.. హీరోయిన్‏గానే కాదు.. విలన్‏గానూ అదుర్స్.. బర్త్ డే వేళ ఆసక్తికర విషయాలు..
Kajol 1
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2021 | 12:26 PM

Share

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‏కు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. దాదాపు మూడు దశాబ్ధాల సినీ కెరీర్‏లో కాజోల్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి.. టాప్ హీరోయిన్స్ స్థానంలో సుధీర్ఘ కాలం కొనసాగింది. తెలుగులో ప్రభుదేవా సరసన మెరుపు కళలో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోల సరసన నటిస్తూ.. వరుస సినిమాలతో కెరీర్ ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే కాజల్ పెద్ద సాహాయం చేసింది. ఆమె నటించిన సూపర్ హిట్ చిత్రాలలో 1997లో విడుదలైన గుప్త్.. ది హిడెన్ ట్రూత్ సినిమా ఒకటి. రాజీవ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మనీషా కొయిరాల, బాబీ డియోల్ కీలక పాత్రలలో నటించగా.. పరేశ్ రావల్, ఓం పురి, రాజ్ బబ్బర్, ప్రేమ్ చోప్రా, దలీప్ తహిల్, ప్రియా టెండూల్కర్ ముఖ్య పాత్రలు పోషించారు.

Kajol

Kajol

అయితే ఈ సినిమాలో కాజోల్ ప్రతినాయిక పాత్రలో నటించి .. ప్రశంసలు అందుకుంది. అప్పటీ వరకు స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతూ.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా కాజోల్ ఈ పాత్రకు ఓకే చెప్తుందా అని అందరూ సందేహించారట. అనుమానంగానే డైరెక్టర్ రాజీవ్ రాయ్.. కాజోల్‏కు సినిమా స్టోరీని వివరించారట. కానీ కాజోల్ కథ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కెరీర్ మంచి జోష్ మీదున్న సమయంలో కాజోల్ విలన్ పాత్రకు ఓకే చెప్పడం అప్పట్లో పెద్ద సాహసమే. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే కాజోల్ కెరీర్ పై దారుణంగా మారిపోయి ఉండేదని ఇప్పటికీ సినీ ప్రముఖులు అంటుంటారు. కానీ సీనిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో కాజోల్ నటనకు ఏకంగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది. ఈరోజు కాజోల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె భవిష్యత్తులో మరిన్ని పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాలని.. బర్త్ విషెస్ తెలుపుతుంది టీవీ9 తెలుగు.

ట్వీట్..

Also Read:  Genelia D’Souza: జెనీలియా.. రితేష్ తమ ప్రేమను ఎన్ని సంవత్సరాలు రహస్యంగా ఉంచారో తెలుసా..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం