ఆ చేప నోట్లో మనిషి ‘పళ్ళు’..అమెరికాలోని జాలరికి లభించిన అరుదైన మత్స్యం-Fish With Human Like Teeth.
అమెరికాలోని నార్త్ కెరొలినాలో ఓ జాలరికి సముద్రంలో విచిత్రమైన చేప దొరికింది. దీని నోట్లో పళ్ళు ఉండడమే గాక- అవి అచ్చు మనిషి పళ్ళ మాదిరే ఉన్నాయి. నాథన్ మార్టిన్ అనే ఈ జాలరి వలలో ఈ అరుదైన చేప దొరికిందని అక్కడి ఓ సంస్థ తన ఫేస్ బుక్ లో
అమెరికాలోని నార్త్ కెరొలినాలో ఓ జాలరికి సముద్రంలో విచిత్రమైన చేప దొరికింది. దీని నోట్లో పళ్ళు ఉండడమే గాక- అవి అచ్చు మనిషి పళ్ళ మాదిరే ఉన్నాయి. నాథన్ మార్టిన్ అనే ఈ జాలరి వలలో ఈ అరుదైన చేప దొరికిందని అక్కడి ఓ సంస్థ తన ఫేస్ బుక్ లో దీని ఫోటోను పోస్ట్ చేసింది. ‘షీఫ్స్ హెడ్’ అని వ్యవహరించే ఈ అరుదైన చేపలు జెట్టీలు, రాళ్ల ప్రాంతాలు, చివరకు బ్రిడ్జీల సమీపంలో కూడా కనిపిస్తాయట. వీటిపైని నల్లని, తెలుపు చారల కారణంగా వీటిని కాన్విక్ట్ ఫిష్ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇవి ఓమ్నీవారస్ జాతికి చెందినవైనందున వీటి పళ్ళు మానవుల పళ్ళు మాదిరే ఉంటాయని జంతు నిపుణులు చెబుతున్నారు. ఇవి 5 నుంచి 15 పౌండ్ల బరువు ఉంటాయి. ఎక్కువగా నార్త్ కెరొలినా లోని కోస్తా జలాల్లో సంవత్సరం పొడవునా కనిపించినా జాలర్ల వలలో పడడం మాత్రం అరుదని అంటున్నారు.
తమ ఎరల పై ఉండే షెల్స్ (పెంకుల) ను పగులగొట్టేందుకు ఈ చేపలు ఈ పళ్ళను వినియోగించుకుంటాయని, ఇవి చాలా గట్టిగా ఉంటాయని సముద్ర నిపుణులు వెల్లడించారు. గత ఫిబ్రవరిలో ఈ తరహా చేప ఒకటి ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ లో ఓ జాలరికి లభించింది. అయితే వీటిని ఆహారంగా తినవచ్చా అన్న విషయంలో ఐ[ప్పటివరకు స్పష్టత లేదు..
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.