Mobile‌ Explosion: మొబైల్ ఫోన్స్ ఎందుకు పేలుతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?

Mobile‌ Explosion: ప్రస్తుత కాలంలో మొబైల్‌ వాడకం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండిపోతుంది. ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతారు కానీ..

Mobile‌ Explosion: మొబైల్ ఫోన్స్ ఎందుకు పేలుతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 03, 2021 | 1:24 PM

Mobile‌ Explosion: ప్రస్తుత కాలంలో మొబైల్‌ వాడకం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండిపోతుంది. ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతారు కానీ.. స్మార్‌ఫోన్‌ లేనిదే ఉండలేకపోతున్నారు. అయితే ఫోన్‌ల వాడకం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్న ఘటనలు అనేక ఉన్నాయి. తాజాగా నిన్న బెంగళూరులో వన్‌ప్లస్‌ నార్డ్‌-2 5జీఫోన్‌ పేలింది. ఓ మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉన్న ఫోన్‌ ఒక్కసారిగా పేలిపోవడం భయాందోళనకు గురి చేసింది. అయితే ఫోన్‌ పేలిపోయినందుకు చింతిస్తున్నామని సదరు ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ తెలిపింది.

ఫోన్‌లు ఎందుకు పేలుతున్నాయి?

ఫోన్‌లు పేలడానికి ప్రధాన కారణంగా అందులో ఉండే బ్యాటరీ. స్మార్ట్‌ ఫోన్లలోని లిథియం అయాన్ బ్యాటరీలతో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఈ రకం బ్యాటరీలనే వినియోగిస్తున్నాయి కంపెనీలు. లిథియంతో పాటు ధన అయాన్ క్యాథోడ్‌, రుణ అయాన్ ఆనోడ్ ఉంటాయి. ఈ రెండింటినీ వేరు చేస్తూ కర్బన ద్రవం ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ధన, రుణ అయాన్లు ఒకదానికొక‌టి తాకితే ర‌సాయ‌న చ‌ర్య జ‌రిగి పేలుడు సంభ‌విస్తుంది. అందుకే రెండింటినీ ఎలక్ట్రోలైట్లతో వేరు చేస్తారు.

బ్యాటరీని ఛార్జ్ చేసినప్పుడు అయాన్లు ఒకే దిశ‌లో ప్రవహిస్తుంటాయి. ఛార్జింగ్ ప్లగ్ తీసేయగానే అవి విద్యుత్‌ను రెండు వైపులా ప్రసారం చేస్తాయి. అయితే, క్యాథోడ్, ఆనోడ్‌ల మధ్య కర్బన ద్రవంలోంచి లిథియం కదులుతూ ఉంటుంది. క్విక్ ఛార్జింగ్ పద్ధతుల్లో బ్యాటరీని ఛార్జి చేసేటప్పుడు అధిక వేడి ఉత్పత్తి అయి ఆనోడ్‌పై లిథియం పేరుకుపోతుంది. దానివల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీలను ఒక నిర్దిష్ట ఓల్టేజి విద్యుత్‌తో ఛార్జ్‌ చేసేలా తయారు చేస్తారు. అలాకాకుండా, క్విక్ చార్జర్లతో వేగంగా చార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తే కూడా ప్రమాదాలకు అవకాశం ఉంటుందంటున్నారు.

పేలుడుకు ఇతర కారణాలు…

కొందరు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టేసి అలా వదిలేస్తుంటారు. దానివల్ల 100 శాతం ఛార్జింగ్ పూర్తయిన తరువాత కూడా ఇంకా విద్యుత్ సరఫరా అవుతుంటుంది. అయాన్లలో విద్యుదావేశం పెరిగి వేడెక్కి మండిపోతుంది. స్మార్ట్ ఫోన్ కిందపడినప్పుడు ఒక్కోసారి అందులోని బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్యాటరీ లోపలి భాగాల్లో చీలికలు ఏర్పడినా, లేదంటే అమరికలో మార్పులు వచ్చినా షార్ట్ సర్క్యూట్‌ జరిగి మండిపోవడానికి కారణం కావచ్చు అంటున్నారు టెక్‌ నిపుణులు.

నాణ్యత లేని బ్యాటరీలతో సమస్య..

అయితే మొబైల్‌లో నాణ్యత లేని బ్యాటరీలతో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. బ్యాటరీలో లోపలి భాగాల మధ్య కంటికి కనిపించని లోహ రేణువులు వంటివి ఉంటే అవి ఘటాల మధ్య ఘర్షణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉండగా కాల్స్‌ మాట్లాడినా బ్యాటరీ పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. ఇవన్నీ కాకుండా కొన్ని సెల్‌ఫోన్‌ సెట్ల తయారీలోని లోపాల వలన కూడా పేలే అవకాశాలుంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

► బ్యాటరీలు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాటిని ఫోన్ నుంచి తొలగించాలి. ► కంపెనీకి చెందిన ఒరిజనల్‌ ఛార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి. ► ఛార్జింగ్‌లో ఉండగా కాల్స్‌ మాట్లాడటం, అలాగే గేమ్స్‌ ఆడటం చేయరాదు. ► ఛార్జింగ్ పూర్తయిన తరువాత ప్లగ్‌ నుంచి తొలగించాలి. ► పడుకునేటప్పుడు పక్కనే ఫోన్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టొద్దు. ► ఛార్జింగ్ సమయంలో ఫోన్‌కి ఉండే తొడుగు (కేస్) తొలగించడం మంచిది. ► ఫోన్ బాగావేడిగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఛార్జింగ్ ఆపేయాలి. ► బ్యాటరీలో ఉండే ప్లస్, మైనస్‌లను ఒకదానికొకటి కలపరాదు. ► పని చేయని బ్యాటరీలను మంటల్లో వేయరాదు. వేస్తే పేలుడు సంభవిస్తుంది. ► బ్యాటరీలను రాళ్లతో గానీ, ఇనుపు వస్తువులతో గాని చితక్కొట్టరాదు. ► బ్యాటరీలను విప్పి వాటి లోపలి భాగాలను విడదీసే ప్రయత్నం చేయరాదు. ► బ్యాటరీలను మంటల వద్ద, గ్యాస్‌ స్టవ్‌ల వద్ద, వేడి హీటర్ల వద్ద ఉంచడం మంచిది కాదు. ►ఫోన్‌ నీళ్లలో పడిపోతే వెంటనే ఛార్జింగ్‌ పెట్టకుండా తేమ పూర్తిగా పోయాకే ఛార్జింగ్‌ పెట్టాలి.

గతంలో సెల్‌ఫోన్‌ పేలిన కొన్ని సంఘటనలు…

► 2021, జూలై 16: కర్ణాటక సవనూర్‌లో సెల్​ఫోన్​పేలి 10 ఏళ్ల బాలుడికి తీవ్రగాయాలు. సెల్​ఫోన్​లో గేమ్​ఆడుతుండగా మొబైల్ పేలి, బాలుడు నాలుగు వేళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

► 2020, అగస్టు 12: తమిళనాడు కరూర్‌లో సెల్‌ఫోన్‌ పేలి గదినిండా మంటలు వ్యాపించి ముగ్గురు మృతి చెందారు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌ పెట్టి ఫోన్ కాల్‌ మాట్లాడుతుండగా ఫోన్‌ పేలి యువతి, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

► 2019, మార్చి 10: చిత్తూరు జిల్లా చందం గ్రామంలో సెల్‌ఫోన్ పేలిన ఘటనలో యువతికి తీవ్రగాయాలు. సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగానే ఒకేసారి పెద్ద శబ్ధంతో ఈ పేలుడు జరిగింది.

► 2018, జూలై 30: కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లులో ఓ బాలుడి చేతిలో సెల్‌ఫోన్‌ పేలింది. సెల్‌ఫోన్‌ చేతితో పట్టుకొని పాటలు వింటుండగా బ్యాటరీ పేలి బాలుడి చేతి వేళ్లు రెండు తెగి నేలపై పడిపోయాయి.

► ఇలాంటి ఘటనలో ఎన్నో జరిగాయి. అందుకే ఫోన్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలుంటాయి. ఫోన్‌ ఛార్జింగ్‌ విషయాలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(Research Desk, TV9 Telugu)

రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..