Google Pixel 6: పిక్సెల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. భారత్‌లో ఈ ఫోన్లు..?
గూగుల్ పిక్సెల్ తదుపరి వర్షెన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఆదివారం రాత్రి గూగుల్ తన నూతన పిక్సెల్ 6 సిరీస్‌ను ప్రకటించింది.
Google Pixel 6: గూగుల్ పిక్సెల్ తదుపరి వర్షెన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఆదివారం రాత్రి గూగుల్ తన నూతన పిక్సెల్ 6 సిరీస్‌ను ప్రకటించింది. అయితే ఈ ఫోన్లు ఇండియాలో మాత్రం అందుబాటులో ఉండవని ప్రకటించడంతో గూగుల్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక 6సిరీస్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో ఫోన్లను విడుదల చేయనుంది. కాగా ఈ ఫోన్లను విడుదల చేసే జాబితాలో ఇండియాను చేర్చలేదు.
ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, తైవాన్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు యునైటెడ్ స్టేట్స్ లాంటి 8 దేశాల్లో పిక్సెల్ 6 సిరీస్‌ను ఫోన్లు విడుదలకానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియా, చైనాతోపాటు ఇతర యూరోపియన్ దేశాలలో ఈ ఫోన్లు విడుదల కావడం లేదు. గతేడాది తొమ్మిది ప్రాంతాలలో గూగుల్ పిక్సెల్ 5ని విడుదల చేసింది. కాగా, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌ను ఈ ఏడాది జాబితా నుంచి తొలగించింది. గూగుల్ భారతదేశంలో పిక్సెల్ 6తో సహా చివరి మూడు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను తొలి విడుతగా విడుదల చేయలేదు. మనదేశంలో పిక్సెల్ 4, పిక్సెల్ 5లను కూడా లాంఛ్ చేయకపోవడం గమనార్హం.
ఈ ఎనిమిది దేశాల్లోని వినియోగదారులు పిక్సెల్ 6 సిరీస్‌లో ఫోన్లను పొందేందుకు గూగుల్ స్టోర్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కింది. అయితే అన్ని ప్రాంతాల్లో ఈ ఫోన్లు అన్ని రంగుల్లో లభించవని గూగుల్ పేర్కింది. నిన్న రాత్రి గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌ను ప్రకటించింది.
Here’s a sneak peek at the newest Google Phones powered by Google Tensor – the brand new chip designed by Google, custom-made for Pixel.
Both are coming later this year.
We’ll tell you a little about them in this ? ?
(1/13) pic.twitter.com/SRhzvRA7WC
— Made By Google (@madebygoogle) August 2, 2021
Also Read: Realme smartwatch: రియల్‌మీ నుంచి స్మార్ట్‌వాచ్.. ధర రూ.3 వేల లోపే.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!