Oneplus Nord 2 Exploded: హ్యాండ్‌ బ్యాగ్‌లో పేలిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌.. కంపెనీ ఏమని స్పదించిందంటే..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Aug 02, 2021 | 9:36 PM

Oneplus Nord 2 Exploded: స్మార్ట్‌ ఫోన్‌లు పేలుతున్నాయి లాంటి వార్తలు మనం అడపాదడపా వింటూనే ఉంటాం. సరైన ఛార్జింగ్ లేకపోవడమో, తయారీ పరంగా ఏమైనా లోపాలు ఉంటే...

Oneplus Nord 2 Exploded: హ్యాండ్‌ బ్యాగ్‌లో పేలిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌.. కంపెనీ ఏమని స్పదించిందంటే..
One Plus Phone Blast

Follow us on

Oneplus Nord 2 Exploded: స్మార్ట్‌ ఫోన్‌లు పేలుతున్నాయి లాంటి వార్తలు మనం అడపాదడపా వింటూనే ఉంటాం. సరైన ఛార్జింగ్ లేకపోవడమో, తయారీ పరంగా ఏమైనా లోపాలు ఉంటే ఫోన్‌లు పేలుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. అయితే ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన కేవలం ఐదు రోజులకే పేలి పోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన అంకుర్‌ శర్మ అనే వ్యక్తి భార్య ఇటీవల వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేశారు. ఫోన్‌ను తన హ్యాండ్ బ్యాగులో పెట్టుకొని సైక్లింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఫోన్‌ ఒక్కసారిగా పేలి పోయింది. ఇదే విషయాన్ని అంకుర్‌ శర్మ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశాడు.

పేలిపోయిన ఫోన్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ఒక్కసారిగా ఫోన్‌ పేలడంతో బ్యాగ్‌లో నుంచి పొగవచ్చిందని, దీని కారణంగా తన భార్యకు ప్రమాదం కూడా జరిగిందని ట్వీట్ చేశాడు. దీంతో వన్‌ప్లస్‌ సంస్థ ఈ ట్వీట్‌కు స్పందించింది. వన్‌ప్లస్‌ సపోర్ట్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా నుంచి అంకుర్‌ శర్మకు బదులిచ్చింది. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘హాయ్‌ అంకుర్‌.. ఫోన్‌ పేలిందన్న వార్త పట్ల మేము చాలా చింతిస్తున్నాం. మీరు ఈ విషయాన్ని మాకు నేరుగా మెసేజ్‌ చేయండి. మేము ఫోన్‌ను రిప్లేస్‌ చేస్తాము’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అంకుర్‌ వెంటనే తన ట్వీట్‌ను తొలగించాడు. ఇదిలా ఉంటే వన్‌ప్లస్‌ ఫోన్‌ పేలడం ఇదేతొలిసారి కాదు.. 2019లోనూ ఇలాగే బ్లాస్ట్‌ అయినట్లు వార్తలు వచ్చాయి.

Also Read: Water on Mars: అంగారక గ్రహం నుండి వచ్చిన రాడార్ సిగ్నల్స్ నీటికి సంబంధించినవి కావు..అక్కడ ఇంకేదో జరుగుతోంది..

ISRO: ప్రజల్లో ఆసక్తి పెంచడానికి ఇస్రో ప్రచార చిత్రాలు.. పలు కంపెనీలతో ఒప్పందం!

Instagram: టీనేజర్ల భద్రతకు ఇన్‌స్టాగ్రామ్‌ భరోసా.. తెలుగు యూజర్ల కోసం ప్రత్యేకంగా పేరెంట్స్‌ గైడ్‌ విడుదల..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu