Realme smartwatch: రియల్‌మీ నుంచి స్మార్ట్‌వాచ్.. ధర రూ.3 వేల లోపే.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!
Realme smartwatch: స్మార్ట్‌ఫోన్‌లా లాగే స్మార్ట్ వాచ్‌లు కూడా మార్కెట్లో విడుదలవుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో విడుదల అవుతున్నాయి. ఇక రియల్‌మీ సబ్..
Realme smartwatch: స్మార్ట్‌ఫోన్‌లా లాగే స్మార్ట్ వాచ్‌లు కూడా మార్కెట్లో విడుదలవుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో విడుదల అవుతున్నాయి. ఇక రియల్‌మీ సబ్ బ్రాండ్ అయిన డిజో మనదేశంలో మొదటి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఇందులో కలర్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇందులో ఏకంగా 90 స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం విశేషం. లైవ్ వాచ్ ఫేసెస్, బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
ధర ఎంతంటే..
దీని ధరను మనదేశంలో రూ.3,499గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.2,999కే కొనుగోలు చేయవచ్చు. కార్బన్ గ్రే, సిల్వర్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 6వ తేదీ నుంచి వీటికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.
వాచ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 1.4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో పీపీజీ సెన్సా, రియల్ టైం హార్ట్ రేట్ మానిటరింగ్ చేయవచ్చు. ఎస్‌పీఓ2 లెవల్స్ తెలుసుకోవడానికి బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఇందులో ఉంది. అయితే ఇలాంటి వాచ్‌లకు మెడికల్ అప్రూవల్ లేదు కాబట్టి దీనిని వ్యాధుల నిర్థారణకు, చికిత్సకు ఉపయోగించకూడదు. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్స్ అందించారు. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి యాక్టివిటీలను ఇది ట్రాక్ చేయనుంది. స్పిన్నింగ్, హైకింగ్, బాస్కెట్ బాల్, యోగా, రోయింగ్, ఎలిప్టికల్, క్రికెట్, స్ట్రెంత్ ట్రైనింగ్, ఫ్రీ వర్కవుట్‌ల ట్రాకింగ్ సదుపాయాలున్నాయి. అంతేకాదు.. ఈ స్మార్ట్ వాచ్ మీ రోజువారీ ఎక్సర్‌సైజ్, తినే కాలరీలను ఇది లెక్క వేయగలదు. రియల్‌మీ లింక్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైస్‌లకు దీన్ని కనెక్ట్ చేయవచ్చు.
బ్లూటూత్ కనెక్టివిటీ:
ఇందులో బ్లూటూత్ వీ5.0 సపోర్ట్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 315 ఎంఏహెచ్. 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది. దీని మందం 1.22 సెంటీమీటర్లుగానూ, బరువు 38 గ్రాములుగానూ ఉంది.