Godzilla Ramen: మొసలి పాదంతో నూడుల్స్‌.. ఈ విచిత్ర వంటకం తినే అదృష్టం ఇద్దరికి మాత్రమే.. ఎక్కడంటే..

ఇప్పుడు తైవాన్ లో కూడా విచిత్ర వంటకాలకు వేదికగా మారింది. ప్రస్తుతం తైవాన్ రెస్టారెంట్ లో ఓ వింత వంటకంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ రెస్టారెంట్ లో నూడుల్స్‌తో మొసలిని అందిస్తోంది.

Godzilla Ramen: మొసలి పాదంతో నూడుల్స్‌.. ఈ విచిత్ర వంటకం తినే అదృష్టం ఇద్దరికి మాత్రమే.. ఎక్కడంటే..
Godzilla Ramen
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2023 | 12:40 PM

ప్రపంచంలో అనేక దేశాలున్నాయి. భిన్నమైన సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు జీవన పద్దతులున్నాయి. వాటిల్లో విచిత్రమైన ఆహారపదార్ధాలు కూడా ఉంటాయి. కొందరు మిడతలతో తయారు చేసిన పదార్ధాలను తింటే.. మరికొందరు గబ్బిలాలను తింటారు.. ముఖ్యంగా చైనావారు మనుషులను తప్ప అన్నిటింటి ఆహారంగా తింటారు అని అంటారు కూడా.. అయితే ఇప్పుడు తైవాన్ లో కూడా విచిత్ర వంటకాలకు వేదికగా మారింది. ప్రస్తుతం తైవాన్ రెస్టారెంట్ లో ఓ వింత వంటకంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ రెస్టారెంట్ లో నూడుల్స్‌తో మొసలిని అందిస్తోంది.

తైవాన్ న్యూస్ నివేదిక ప్రకారం యున్లిన్ కౌంటీలోని డౌలియు నగరంలో ను వు మావో కుయీ అనే ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ లో .. గత కొన్ని రోజులుగా గాడ్జిల్లా రామెన్ అనే వింత వంటకాన్ని మొదలు పెట్టింది. ఈ ఫుడ్ లో మెయిన్ పదార్ధం ‘మొసలి పాదం’. ఈ రుచికరమైన వంటకాన్ని తయారు చేయడానికి   40 కంటే ఎక్కువ మసాలా దినుసులను ఉపయోగించినట్లు రెస్టారెంట్ యజమాన్యం పేర్కొంది.

గాడ్జిల్లా రామెన్‌ని ఆస్వాదిస్తున్న ఆహార ప్రియులు 

ఇవి కూడా చదవండి

గాడ్జిల్లా రామెన్‌ను ప్రారంభించినట్లు రెస్టారెంట్ తన ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించింది. ఇందులో మొసలి కాలును ఆవిరి మీద ఉడికించి వండుతున్నారు. వైరల్ క్లిప్‌లో ఒక మహిళా కస్టమర్ ఈ ఫుడ్ ను ఆస్వాదిస్తూ తింటోంది.  భిన్నమైన ఈ ఆహార పదార్ధాన్ని రుచి చూసిన తర్వాత.. యువతి ఆహా ఏమి రుచి.. అంటూ నూడుల్స్‌తో మొసలి ఫుడ్ అద్భుతంగా రుచికరంగా ఉందని మైమరచి వివరిస్తోంది.

తాను తిన్న ఫుడ్ సరిగ్గా చికెన్ లాగా ఉందని.. మొసలి మాంసం పంది మాంసం లా ఉందని మహిళ చెప్పింది. నివేదిక ప్రకారం రెస్టారెంట్ యజమాని కొంతకాలం క్రితం థాయ్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ అతను మొసలి పులుసు తయారు చేయడం నేర్చుకున్నాడు. దానికి తన ఆలోచన జోడించి మొసలి కాలుతో  న్యూడుల్ సూప్‌ని తయారు చేసినట్లు.. ఇందులో 40 కంటే ఎక్కువ మసాలా దినుసులను వినియోగించినట్లు పేర్కొన్నారు.

చాలా వింతగా కనిపిస్తున్న ఈ ఫుడ్ ధర 48 డాలర్లు (అంటే మన దేశ కరెన్సీ లో సుమారు 4 వేల రూపాయలు). మొసలి పాదాలను టైటుంగ్‌లోని వ్యవసాయ క్షేత్రం నుండి సేకరిస్తున్నారు. కనుక ఈ ఫుడ్ ని తినాలంటే రోజుకు ఇద్దరు కస్టమర్స్ కు మాత్రమే అవకాశం ఉంది. కనుక ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి అందిస్తామని రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..