Leopard vs Dog: చిరుతను తరిమికొట్టిన పెంపుడు కుక్క.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Leopard vs Dog: చిరుతపులి, కుక్క ఒకదానికి ఒకటి ఎదురుపడితే ఎవరు పలయానం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. కానీ మహారాష్ట్రలోని ఓ పెంపుడు కుక్క తాను ఉంటున్న ఇంట్లోకి వచ్చిన చిరుతను తరిమికొట్టింది. మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో జరిగిన..

Leopard vs Dog: చిరుతను తరిమికొట్టిన పెంపుడు కుక్క.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Leopard Vs Dog
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 29, 2023 | 12:32 PM

Leopard vs Dog: చిరుతపులి, కుక్క ఒకదానికి ఒకటి ఎదురుపడితే ఎవరు పలయానం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. కానీ మహారాష్ట్రలోని ఓ పెంపుడు కుక్క తాను ఉంటున్న ఇంట్లోకి వచ్చిన చిరుతను తరిమికొట్టింది. మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్లు కనిపించనంతటి చీకటిలో తన ఇంటికి వచ్చిన సదరు పెంపుడు కుక్క ఇప్పుడు నెటిజన్ల దృష్టిలో హీరోగా మారింది.

వైరల్ అవుతున్న వీడియోని కనుక పరిశీలిస్తే.. అర్థరాత్రి వేళ ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత, కంటికి కనిపించిన కుక్కపై దాడికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ పెంపుడు కుక్క ఎదురుదాడికి దిగింది. అంతే  ఒక్కసారిగా వెనక్కు పడిన చిరుత అక్కడ నుంచి పరుగులు తీసింది. అయితే ఈ ఘటన విషయంలో తర్వాత ఏం జరిగింది అనే విషయాలు తెలియరాలేదు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ ప్రకారం ఇది మహారాష్ట్ర అహల్యానగర్‌లోని రాహూరి తాలుకాలో జరిగిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..