AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhim Army chief: భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పులు.. కారులో వచ్చి ఎటాక్ చేసిన దుండగులు..

భీమ్ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్ ఆజాద్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఆయన కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆజాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Bhim Army chief: భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పులు.. కారులో వచ్చి ఎటాక్ చేసిన దుండగులు..
Bhim Army Chief
Shiva Prajapati
|

Updated on: Jun 29, 2023 | 10:39 AM

Share

భీమ్ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్ ఆజాద్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఆయన కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆజాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆజాద్‌ సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్‌ ఆర్మీచీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. యూపీలోని సహ్రాన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో తిరుగుపయనమైన సందర్భంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆజాద్‌ పరిస్థితి బాగానే ఉందని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

దళిత నాయకుడు చంద్రశేఖర్‌పై కాల్పుల ఘటనతో యూపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఎటాక్‌ చేసిన వారిని తన అనుచరులు గుర్తించారని ఆయన చెప్పారు. దుండగులు హర్యానా లైసెన్స్ నెంబర్ ప్లేట్ కలిగిన కారులో వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అజాద్ టయోటా ఫార్చ్యునర్ కారులో ప్రయాణిస్తున్నారు. కారులోని సీటు, డోర్ పై బుల్లెట్ తగిలినట్లు గుర్తించిన పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

బహుజన శక్తిని అడ్డుకునే కుట్రలో భాగంగానే తనపై దాడి జరిగి ఉండవచ్చన్నారు చంద్రశేఖర్‌ ఆజాద్‌. భీమ్‌ ఆర్మీచీఫ్‌ కార్యకర్తలు సహనం పాటించాలని సూచించారు. తుపాకులతో పోరాడే సంస్కృతి మనది కాదని, అందరూ శాంతి పాటించాలని కోరారు. కాగా, కాల్పులు జరిగిన సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్‌ ఆజాద్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గరికి భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకుని పరామర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..