Optical Illusion: నక్కి నక్కి చూస్తున్న నంగనాచి గుర్రం.. 10 సెకన్లలో కనిపెట్టే సత్తా మీలో ఉందా?
IQ Test: గొడలకు కూడా చెవులుంటాయని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే.. గొడచాటుగా నిల్చుని మన మాటలు వినేవారు ఉంటారనే అర్థంలో ఈ పదాన్ని వాడుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో కొందరు అవతలివైపు ఏం జరుగుతుందా? అని తెలుసుకునే ఉత్సుకతతో తొంగి తొంగి చూస్తుంటారు.
IQ Test: గొడలకు కూడా చెవులుంటాయని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే.. గొడచాటుగా నిల్చుని మన మాటలు వినేవారు ఉంటారనే అర్థంలో ఈ పదాన్ని వాడుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో కొందరు అవతలివైపు ఏం జరుగుతుందా? అని తెలుసుకునే ఉత్సుకతతో తొంగి తొంగి చూస్తుంటారు. మనుషులే కాదు.. కొన్నిసార్లు జంతువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తాయి. ఇందుకు నిదర్శనంగా క్రియేట్ చేసిన ఓ ఆప్టికల్ ఇమేజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పైకి మనకు భారీ ఏనుగు కనిపిస్తున్నప్పటికీ.. అంతర్లీనంగా ఓ గుర్రం కూడా దాగిఉంది. రహస్యంగా దాగి ఉన్న గుర్రాన్ని కనిపెట్టడమే మీ టాస్క్.
వాస్తవానికి మనం ఆకాశంలో చూసినప్పుడు కొన్ని ఆకారాలు కనిపిస్తుంటాయి. తదేకంగా మేఘాలను చూస్తున్నప్పుడు రకరకాల ఆకారాలు మనకు కనిపిస్తాయి. కానీ, అది నిజం కాదు. వైరల్ అవుతున్న ఫోటోలో కూడా అలాంటి ఆకారమే ఉంది. చూసేందుకు గుర్రం తల మాదిరిగా ఉన్న ఆ కారం.. ఈ ఫోటోలో ఉంది. మరి ఆ ఆకారం ఎక్కడుంది? అనేది మీరు గుర్తించాలి. మరెందుకు ఆలస్యం.. ట్రై చేయండి. గుర్రం ఆకారాన్ని కనిపెట్టండి.
ఏంటి కనిపెట్టలేదా?
ఇంకా గుర్రం ఆకారం దొరకలేదా? మరేం పర్వాలేదు. కింద ఫోటోలో సమాధానం చూసేయండి. అయితే, ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్ కారణంగా మీ దృష్టి శక్తి, ఆలోచనా విధానం, సహనం, ఓర్పు, మెదడు పనితీరు మెరుగుపడతాయి. అందుకే చాలామంది వీటిపట్ల ఆసక్తి కనబరుస్తారు. ఈ కారణంగానే ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్స్ ట్రెండ్ నడుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..