Viral: భార్య హనీమూన్‌కు తీసుకెళ్లమందని.. చేయకూడని పని చేశాడు.. చివరికి!
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జూన్ 27న బుల్లెట్ బైక్, రూ. 1.9 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్‌ను కొట్టేసిన దొంగను పట్టుకున్నారు..
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జూన్ 27న బుల్లెట్ బైక్, రూ. 1.9 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్‌ను కొట్టేసిన దొంగను పట్టుకున్నారు మొరదాబాద్ పోలీసులు. ఆ రెండు నేరాలను తానే చేశానని అంగీకరించిన సదరు దొంగ.. ఈ దొంగతనాలను తన భార్య విలాసవంతమైన కోరికలను తీర్చేందుకే చేశానని చెప్పుకొచ్చాడు. ఆ మాటతో పోలీసులు కాసింత షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. మొరదాబాద్‌లోని కరులా ప్రాంతానికి చెందిన హషీమ్ అనే వ్యక్తికి జనవరిలో పెళ్లైంది. అతడి భార్యకు ఖరీదైన వస్తువులు, లగ్జరీ ట్రిప్‌లంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తన భర్తను బుల్లెట్ బైక్ కావాలని.. హనీమూన్‌కు మనాలీ తీసుకెళ్లాలని కోరుతుంది. ఆమె అడిగిన రెండు కోరికలను తీరుస్తానని హషీమ్ ప్రామిస్ చేశాడు. అయితే సరిపడా డబ్బులు లేకపోవడంతో కొంచెం వెనకడుగు వేశాడు. కానీ భార్య నుంచి పదేపదే ఒత్తిడి రావడంతో.. చేసేదేమిలేక జూన్ 3న మొదటిగా బుల్లెట్ బైక్ దొంగలించాడు. ఆ మరుసటి రోజే రూ. 1,90,000 నగదు ఉన్న బ్యాగ్ ఎత్తుకెళ్లాడు. ఆ వెంటనే భార్యను తీసుకుని హనీమూన్‌కు మనాలీ వెళ్లాడు. ఆ ట్రిప్‌కు సుమారు రూ. 45 వేలు ఖర్చు పెట్టాడు. ఈలోగా పోలీసులు సీసీ ఫుటేజ్ సాయంతో హషీమ్ మనాలీ వెళ్లినట్లు గుర్తించారు. ట్రిప్ ముగించుకుని వచ్చే క్రమంలో అతడ్ని పట్టుకుని.. బుల్లెట్ బైక్, మిగిలిన రూ. 86 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.