Bizarre: ‘నాకు రష్యన్ అమ్మాయి కావాలి’.. కాలేజీలో రచ్చ రచ్చ చేసిన కంత్రీ పోరడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్!

కాలేజీకి వెళ్లి సదువుకోరా అయ్యా అంటే.. కాదని కంత్రీ పనులు చేస్తారు కొందరు.. మరి లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేసే రక్షక భటులు ఊరుకుంటారా? వారి స్టైల్లో వారు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఓ యువకుడి విషయంలో ఇదే జరిగింది. మరి ఏమైందో ఏమో గానీ..

Bizarre: ‘నాకు రష్యన్ అమ్మాయి కావాలి’.. కాలేజీలో రచ్చ రచ్చ చేసిన కంత్రీ పోరడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్!
Up Youth Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 28, 2023 | 11:32 AM

కాలేజీకి వెళ్లి సదువుకోరా అయ్యా అంటే.. కాదని కంత్రీ పనులు చేస్తారు కొందరు.. మరి లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేసే రక్షక భటులు ఊరుకుంటారా? వారి స్టైల్లో వారు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఓ యువకుడి విషయంలో ఇదే జరిగింది. మరి ఏమైందో ఏమో గానీ.. ఓ కుర్రాడు ప్లకార్డు పట్టుకుని కాలేజీ మొత్తం రచ్చ రచ్చ తిరిగాడు. ఆ అబ్బాయిని చూసి కాలేజీ విద్యార్థులు, కాలేజీ స్టాఫ్, జనాలు అవాక్కయ్యారు. చివరకు మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు వచ్చి సారు గారిని నేరుగా స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ అయ్యగారికి కావాల్సింది, కోరింది, అన్నీ డబుల్ డబుల్ ఇచ్చేశారట. మరి ఇంతకీ ఆ అబ్బాయి ప్లకార్డ్‌‌పై ఏం రాశాడు? ఏం ప్రదర్శించాడు? ఏం కోరాడు? ఇంట్రస్టింగ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలోని శ్రీరామ్ కాలేజీలో ఓ యువకుడు వింత పని చేశాడు. ‘నాకు రష్యన్ అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది?’ అంటూ ప్లకార్డ్ ప్రదర్శించాడు. కాలేజీ మొత్తం కలియతిరుగుతూ రచ్చ రచ్చ చేశాడు. యువకుడి చర్యను కొందరు వీడియో తీసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి చేసిన పని అభ్యంతకరమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువకుడు ప్రదర్శించిన ప్లకార్డ్.. రష్యన్ అమ్మాయిలను పరోక్షంగా సెక్స్‌ వర్కర్లుగా సూచిస్తోందని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

వీడియో అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరకు పోలీసుల కంట పడింది. ఇంకేముంది.. యువకుడి అడ్రెస్ కనుక్కిన నేరుగా అతని వద్దకు వెళ్లారు. అతన్ని జీప్‌లో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇతని చర్యలపై తగు చర్యలు తీసుకుంటామని న్యూమండి పోలీసులు తెలిపారు. యువకుడి చర్య అమ్మాయిలను కించపరిచేదిగా ఉందని, తమకు చాలా కంప్లైంట్స్ వచ్చాయని తెలిపారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..