Alternatives for Tomatoes: భారీగా పెరిగిన ధరలు.. కూరల్లో టమాటాకు బదులు వీటిని వేసుకోవచ్చు..
Alternatives for Tomatoes: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ప్రతి కూరగాయల రేటు రూ. 60 నుంచి రూ.100 కు పైగానే ఉంది. ముఖ్యంగా టమాటా రేటు రోజు రోజుకు డబుల్ అవుతోంది. టమాటా సెంచరీ కొట్టగా..
Alternatives for Tomatoes: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ప్రతి కూరగాయల రేటు రూ. 60 నుంచి రూ.100 కు పైగానే ఉంది. ముఖ్యంగా టమాటా రేటు రోజు రోజుకు డబుల్ అవుతోంది. టమాటా సెంచరీ కొట్టగా.. పచ్చి మిర్చి డబుల్ సెంచరీకి చేరువయ్యింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
టమాటా ధరలు ఎంత పెరిగినప్పటికీ.. కూరల్లో వేయకుండా తినలేని పరిస్థితి ఉంటుంది. సలాడ్ మొదలు, ప్రతి కూరలో టమాటా తప్పనిసరిగా వేయాల్సిందే. లేదంటే ఆ కూర రుచి పచి ఉండదు. కానీ, పెరిగిన ధరల కారణంగా కొనబోతే కొరివి.. తినబోతే అడవి.. అన్న చందంగా ఉంది పరిస్థితి. అయితే, పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని, వంటకాల్లో టమాటాలకు ప్రత్యామ్నాలను వినియోగించే అవకాశం ఉంది. టొమాటోలకు బదులుగా వంటల్లో వినియోగించే ప్రత్యామ్నాయాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
టమాటాలకు ప్రత్యామ్నాయ పదార్థాలు ఇవే..
చింతపండు: టమాటాకి బదులుగా కూరల్లో దానిని రుచిని అందించేందుకు చింతపండును వినియోగించొచ్చు. చింతపండును కూరలో వేయడం ద్వారా టమాటా రుచిని ఆస్వాదించొచ్చు.
వేయించిన బెల్ పెప్పర్స్: వేయించిన బెల్ పెప్పర్స్‌ను టమాటాకి ప్రత్యామ్నాయంగా వినియోగించొచ్చు. ఇది వంటకాల్లో టమాటా ఫ్లేవర్‌ను అందిస్తుంది.
మందారపువ్వు: టమాటాకు బదులుగా మందారపువ్వును కూడా కూరల్లో వేయొచ్చు. తద్వారా టమాటా ఫ్లేవర్‌ను కూరల్లో ఆస్వాదించొచ్చు.
వెనిగర్: కూరల్లో పుల్లని రుచి కోసం టమాటా తరువాత అంతటి టేస్ట్ ఇచ్చేది వెనిగర్ అని చెప్పొచ్చు. కూరల్లో యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకోవచ్చు. పైగా ఇది హెల్తీ కూడా. ఇందులోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పేగుల ఇన్‌ఫెక్షన్, మలబద్ధకంతో పోరాటడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఎలిఫెంట్ యాపిల్(చుల్తా): దీనిని చుల్తా అని పిలుస్తారు. మన దేశంలో ఎక్కువగా తూర్పువైపున సాగు చేస్తారు. బంగ్లాదేశ్, మలేషియాలో ఎక్కువగా ఉంటాయి. అస్సామీ, బెంగాలీ వంటలలో ప్రత్యేక రుచి కోసం వీటిని వినియోగిస్తారు. ఇవి కూడా వంటలకు టమాటా రుచిని ఇస్తాయి.
పుల్లటి పెరుగు: పుల్లని పెరుగు కూడా వంటకాల్లో వినియోగించొచ్చు. ఇవి కూడా టమాటా మాదిరి రుచిని ఇస్తాయి.
గుమ్మడికాయ: గుమ్మడి కాయను కూడా టమాటాకు ప్రత్యామ్నాయంగా కూరల్లో వేయొచ్చు. ఇది పుల్లటి అనుభూతిని ఇస్తుంది.
పచ్చి మామిడి: పచ్చి మామిడి కాయను కూడా టమాటాకి ప్రత్యామ్నాయంగా కూరల్లో వేయొచ్చు. ఇది టేస్ట్‌కు టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..