Keychain Boy: జనంలో ఇంకా స్పందించే గుణం బతికే ఉంది..! కీచైన్లు అమ్మే బాలుడికి భరోసా..
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు భిక్షాటన చేయడం చూస్తుంటాం. సిగ్నల్ పడగానే పెద్దలతో పాటు పిల్లలు పరిగెత్తుకొస్తారు. సిగ్నల్ చేంజ్ అయిన తర్వాత ముందుకు కదిలే ట్రాఫిక్ ప్రవాహానికి కొందరు అడ్డుపడుతుంటారు. ఈ ప్రక్రియలో గాయాలపాలవుతుంటారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు భిక్షాటన చేయడం చూస్తుంటాం. సిగ్నల్ పడగానే పెద్దలతో పాటు పిల్లలు పరిగెత్తుకొస్తారు. సిగ్నల్ చేంజ్ అయిన తర్వాత ముందుకు కదిలే ట్రాఫిక్ ప్రవాహానికి కొందరు అడ్డుపడుతుంటారు. ఈ ప్రక్రియలో గాయాలపాలవుతుంటారు. తాజాగా గుజరాత్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కీచైన్లు అమ్ముతున్న బాలుడి యోగక్షేమాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తి కనబరిచారు. వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ఓ యూజర్ జూన్ 7న పోస్ట్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 74 లక్షల మంది వీక్షించారు.
సిగ్నల్ వద్ద ఆగిన వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో బాలుడి కుడి కాలికి గాయమైంది. గాయాన్ని అస్తవ్యస్తంగా క్లాత్, ప్లాస్టిక్‌తో కవర్ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు బాలుడి గాయంపై ఆందోళన చెందారు. ఈ బాలుడికి తక్షణమే వైద్య సాయం అందించాలని గాయాన్ని అలా వదిలేస్తే గ్యాంగ్రిన్‌గా మారుతుందని కలత చెందారు. బాలుడి అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అందిస్తే తాము ఆపన్న హస్తం అందిస్తామని పలువురు నెటిజన్లు ముందుకొచ్చారు. ఈ వీడియో తన గుండెను కలిచివేసిందని, ప్రేమ, ఆప్యాయతలను పొందాల్సిన వయసులో ఈ బాలుడు నొప్పితోనే తన పనులు చేసుకోవడం కరుడుగట్టిన జీవిత సత్యమని ఓ యూజర్ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..