Delivery After 4 Years: నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయిన పార్శిల్.. ఆశ్చర్యపోతూ పోస్ట్‌ షేర్‌ చేసిన వ్యక్తి..

Delivery After 4 Years: నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయిన పార్శిల్.. ఆశ్చర్యపోతూ పోస్ట్‌ షేర్‌ చేసిన వ్యక్తి..

Anil kumar poka

|

Updated on: Jun 28, 2023 | 9:25 AM

మనం ఏదైనా వస్తువు ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే నాలుగు రోజుల్లో లేదా వారంలో వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యమైతే 10 రోజుల్లో వస్తుంది. కానీ, ఓ వ్యక్తి చేసిన ఆర్డర్ ఏకంగా నాలుగేళ్లకు డెలివరీ అయ్యింది. ఒకప్పుడు అలీఎక్స్‌ప్రెస్ మనదేశంలో చౌకగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను విక్రయించింది.

మనం ఏదైనా వస్తువు ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే నాలుగు రోజుల్లో లేదా వారంలో వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యమైతే 10 రోజుల్లో వస్తుంది. కానీ, ఓ వ్యక్తి చేసిన ఆర్డర్ ఏకంగా నాలుగేళ్లకు డెలివరీ అయ్యింది. ఒకప్పుడు అలీఎక్స్‌ప్రెస్ మనదేశంలో చౌకగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను విక్రయించింది. భారత్ లో అందుబాటులో లేని కొన్ని పరికరాలను ఈ అలీఎక్స్‌ప్రెస్ ద్వారా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారు. ఇటీవల దీన్ని భారత ప్రభుత్వం నిషేధించింది.

ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ అనే టెకీ నాలుగు సంవత్సరాల క్రితం అంటే కొవిడ్ కు ముందు ఈ వెబ్ సైట్ ద్వారా కొన్ని ఉత్పత్తులను ఆర్డర్ చేసాడు. రోజులు గడిచినప్పటికీ తాను ఆర్డర్ చేసిన ఉత్పత్తులు డెలివరీ కాకపోవడంతో ఇక ఎప్పటికీ రావేమోనని అనుకున్నాడు. అయితే నాలుగేళ్ల తర్వాత ఆ పార్శిల్ ఇప్పుడు అతని చేతికి చేరింది.

ఈ విషయాన్ని నితిన్ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసాడు. 2019లో అలీబాబా యాజమాన్యంలోని ఆన్‌లైన్ రిటైల్ సర్వీస్ అయిన అలీఎక్స్‌ప్రెస్ నుండి తాను ఆర్డర్ చేసిన ఉత్పత్తి నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు తనకు డెలివరీ అయిందని ఎప్పటికీ ఆశ కోల్పోకండి అంటూ తెలిపారు. భద్రతాపరమైన సమస్యల కారణంగా భారత ప్రభుత్వం జూన్ 2020లో 58 చైనీస్ యాప్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అందులో అలీ ఎక్స్‌ప్రెస్ ఒకటి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Published on: Jun 28, 2023 09:15 AM