- Telugu News Photo Gallery Bajaj triumph speed 400 and scrambler 400x unveiled check here full details
Bajaj Triumph: బజాన్ నుంచి అదిరిపోయే బైక్స్.. ఆకట్టుకునేలా లుక్, ఫీచర్స్, ఇంజిన్ కెపాసిటీ.. వివరాలు మీకోసం..
Bajaj Triumph Bike: బజాజ్, ట్రయంఫ్ కంపెనీలు కలిసి స్క్రాంబ్లర్ 400x, స్పీడ్ 400 పేర్లతో రెండు సరికొత్త బైక్స్‌ను ఆవిష్కరించాయి. ఈ రెండు మోడల్స్.. వచ్చే నెలలో భారత మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి.
Updated on: Jun 28, 2023 | 1:51 PM

బజాజ్ ఆటో ట్రయంఫ్ కంపెనీతో కలిసి స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ అనే రెండు కొత్త బైక్‌లను ఆవిష్కరించింది. ఈ బైక్‌లను వచ్చే నెల 5వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయనున్నారు.

ఇంజిన్ వివరాలు: బజాజ్, ట్రయంఫ్ భాగస్వామ్యంలో వస్తున్న మొదటి బైక్ ఇది. ఈ మోడల్‌లలో కొత్త TR సిరీస్ 398.15 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ DOHC ఇంజన్ ఇవ్వబడింది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

భద్రత: 400 cc సెగ్మెంట్ బైక్‌లు హైబ్రిడ్ స్పైన్ / పెరిమీటర్ ఫ్రేమ్‌తో రూపొందించారు. ఈ మోడళ్లు 43MM అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లను, వెనుక వైపున గ్యాస్ చార్జ్డ్ మోనో షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉన్నాయి. డ్యూయల్ ఛానెల్ ABS ఫీచర్ ఉంది.

ఫీచర్స్: ఈ బైక్‌లలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. LCD అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సహా అనేక ఫీచర్స్ ఈ మోడల్ బైక్స్‌లో ఉన్నాయి.

ధర: ఈ రెండు బైక్‌లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. జూలై 5న భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో ఈ మోడళ్ల ధర దాదాపు రూ. 3 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉండవచ్చని అంచనా.





























