Love: అలిగిన ప్రేయసి.. అద్భుత రీతిలో సారీ చెప్పిన ప్రియుడు.. చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

పెళ్లైన దంపతులు అయినా, ప్రేమికులు అయినా.. కోపతాపాలు కామన్. ప్రేమికులు, దంపతుల్లో ఎక్కువ శాతం సంతోషంగా గడిపిన క్షణాల కంటే.. కీచులాడుకునే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఇక గొడవ పడటం.. ఆ కాసేపటికే సారీ చెప్పడం కామన్.

Love: అలిగిన ప్రేయసి.. అద్భుత రీతిలో సారీ చెప్పిన ప్రియుడు.. చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
Sorry Sanju
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 28, 2023 | 2:07 PM

పెళ్లైన దంపతులు అయినా, ప్రేమికులు అయినా.. కోపతాపాలు కామన్. ప్రేమికులు, దంపతుల్లో ఎక్కువ శాతం సంతోషంగా గడిపిన క్షణాల కంటే.. కీచులాడుకునే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఇక గొడవ పడటం.. ఆ కాసేపటికే సారీ చెప్పడం కామన్. అయితే, తాజాగా ఓ ప్రియుడు తన ప్రేయసికి సారీ చెప్పిన విధానం సెన్సేషన్‌గా మారింది. స్థానిక ప్రజలే కాదు.. అది చూసిన సోషల్ మీడియా ప్రపంచం కూడా అవాక్కైంది అబ్బురపడింది. గొడవ కారణంగా అలిగిన తన ప్రేయసికి వినూత్న రీతిలో క్షమాపణలు చెప్పాడు ఓ ప్రియుడు. వాస్తవానికి ఇది నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవచ్చు.

దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడాలో ఓ యువకుడు తన ప్రేయసికి క్షమాపణలు చెబుతూ భారీ బిల్‌బోర్డు ఏర్పాటు చేశాడు. తామిద్దరికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలను యాడ్ చేసి.. సారీ చెప్పాడు. ఈ భారీ హోర్డింగ్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు జనాలు. ‘నన్ను క్షమించు సంజు. ఇంకెప్పుడూ నీ హృదయాన్ని గాయపరచను. నీ సుష్’ అంటూ క్యాప్షన్ ఉంది. అంతేకాదు.. ఈ హోర్డింగ్‌పై అమ్మాయి, అబ్బాయికి చెందిన చిన్ననాటి ఫోటోలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ హోర్డింగ్‌ను చూసిన జనాలు షాక్ అవుతున్నారు. అదే సమయంలో ప్రియుడి ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. నిజమైన ప్రేమకు నిదర్శనం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మాయి ఎవరో గానీ.. క్షమించండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..