AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: అది అంబానీ రేంజ్‌.. ఒక్క కారు పెయింట్ ఖర్చు రూ. కోటి.. పూర్తి ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అంబానీ ఇంట విలాసవంతమైన, లగ్జరీ కార్లకు కొదువే లేదు. ఆయన దగ్గర కోట్లు విలువ చేసే కార్లు చాలానే ఉన్నాయి. రోల్స్ రాయిస్ నుండి ఫెరారీ వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు అంబానీ గ్యారేజీలో ఉన్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. అంబానీ ఇంట్లోని ఒక పెయింటింగ్ పనుల కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చుపెట్టారు.

Mukesh Ambani: అది అంబానీ రేంజ్‌.. ఒక్క కారు పెయింట్ ఖర్చు రూ. కోటి.. పూర్తి ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Ambani Bought A New Car
Jyothi Gadda
|

Updated on: Jun 28, 2023 | 3:54 PM

Share

భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ వద్ద విలాసవంతమైన కార్లు అనేకం ఉన్నాయి. రోల్స్ రాయిస్ నుండి ఫెరారీ వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉంది అంబానీ కుటుంబం. ఇటీవలే అంబానీ గ్యారేజీలోకి మూడో రోల్స్ రాయిస్ కల్లినన్ కారు కూడా చేరింది. ఈ కారు ప్రత్యేకమైన కస్టమైజేషన్ కారణంగానే కాకుండా దాని ప్రత్యేకమైన నంబర్ ప్లేట్, అధిక ధర కారణంగా వార్తల్లోకెక్కింది. అయితే, ఇవన్నీ పక్కనపెడితే.. ఈ లగ్జరీ కారులో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఈ కారు పెయింటింగ్ పనుల కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చుపెట్టారు. నివేదికల ప్రకారం, ఈ రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర దాదాపు రూ.13.14 కోట్లు. సాధారణంగా రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర రూ.6.8 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. అయితే పెయింటింగ్, 21 అంగుళాల వీల్స్, ఇతర కస్టమైజేషన్ పనులతో పాటు కారు ధర రూ.13.14 కోట్లకు చేరుకుంది.

అంబానీ కుటుంబానికి చెందిన ఈ కొత్త రోల్స్ రాయిస్ కల్లినన్‌కార్‌ను ఇటీవల మెర్సిడెస్ AMG-వాగన్, MG గ్లోస్టర్‌లు ఎస్కార్ట్ చేశారు. ఈ కొత్త కారు టస్కాన్ సన్ కలర్ షేడ్‌తో ఉంది. ఈ రంగు పెయింటింగ్ ధర రూ.1 కోటి ఖర్చవుతుందని చెబుతున్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ‘0001’, ఈ నెంబర్‌ కోసం అంబానీ కుటుంబం రూ. 12 లక్షలు వెచ్చించారు. ప్రస్తుత సిరీస్‌లోని అన్ని నంబర్‌లు ఉన్నాయి. కాబట్టి అంబానీ కుటుంబం కొత్త సిరీస్ నంబర్‌లను ఎంచుకుంది. దీనికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ జనవరి 2037 వరకు చెల్లుతుంది. ఈ ఖర్చులన్నింటికీ అదనంగా 40,000 ఖర్చు చేశారు. రోడ్డు భద్రత పన్ను కూడా చెల్లించారు.

నివేదికల ప్రకారం..ఈ కొత్త కారును ముఖేష్ అంబానీ కోసం కొనుగోలు చేయలేదు. ఈ కొత్త కారును అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌కు ఎంగేజ్‌మెంట్ బహుమతిగా అందించారు. వారిద్దరికీ 2023 జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఈ కారు కూడా అదే నెలలో రిజిస్టర్ చేయబడింది. భద్రతా కారణాల దృష్ట్యా అతను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తాడు. ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ఇంట్లో లగ్జరీ కార్ పార్కింగ్ కోసం పెద్ద మొత్తంలో స్థలాన్ని కేటాయించారు. యాంటిలియాలో కార్ పార్కింగ్ కోసం 400,000 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇక్కడ అదనంగా158 పెద్ద కార్లను పార్క్ చెయ్యొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..