Wine Festival: మస్త్‌ మస్త్‌ పండగ..! 400 డ్రోన్‌లు ఆకాశంలో వైన్ అందించాయి.. వీడియో చూస్తేనే కిక్కు

మీరు ఎయిర్‌ షో చూసే ఉంటారు..అక్కడ ఆకాశంలో విమానాలు మెటల్ పక్షుల్ల ఎగరటం చూసి ఆనందపడుతుంటారు. అయితే, ఎప్పుడైనా వైన్‌ ఫెస్టివల్‌ పేరు విన్నారా..? ఇక్కడ డ్రోన్లు ఆకాశంలో కాంతి చిత్రాన్ని రూపొందించి వైన్ అందించాయి..! ఫ్రాన్స్‌లో జరుగుతున్న వైన్ ఫెస్టివల్‌లో భాగంగా 400 కి పైగా డ్రోన్‌లు ఆకాశంలో అందమైన చిత్రాన్ని రూపొందించాయి. ఈ అందమైన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Wine Festival: మస్త్‌ మస్త్‌ పండగ..! 400 డ్రోన్‌లు ఆకాశంలో వైన్ అందించాయి.. వీడియో చూస్తేనే కిక్కు
Wine Festival
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2023 | 9:20 PM

మీరు వైన్ ప్రియులైతే దానికి కూడా ఒక రోజు ఉంటుందని మీకు తెలుసా? అవును ఈ ఆల్కహాలిక్ వైన్‌కు కూడా ఒక రోజు ఉంది. మన దేశంలో వైన్‌కు విదేశాలలో ఉన్నంత ఆదరణ లేదు. కానీ, విదేశాలలో ఇది చాలా ప్రాచుర్యం పొందిన పానీయం. కాబట్టి దానికంటూ ప్రత్యేక రోజును జరుపుకుంటారు. అదేవిధంగా ఫ్రాన్స్‌లోని బోర్డోక్స్‌లో జూన్ 23, 24 తేదీల్లో వైన్ ఫెస్టివల్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పండుగను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఆకాశంలో కాంతి చిత్రాన్ని రూపొందించారు. 400కు పైగా డ్రోన్లు వైన్ బాటిల్, వైన్ గ్లాస్ ఆకారంలో ఆకాశంలో కాంతి చిత్రాన్ని రూపొందించి అందరినీ దృష్టిని ఆకర్షించాయి. వైన్ బాటిల్ లోని వైన్ ను గ్లాస్ లోకి పోయడం వంటి సన్నివేశాలు అక్కడ రూపొందించి చూపరుల కళ్లకు కట్టారు. ది ఫిజెన్ అనే ట్విట్టర్ పేజీ పోస్ట్ చేసిన ఈ వీడియోను 6 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు.

ఈ చిత్రాన్ని డ్రోన్‌లతో రూపొందించినందుకు నెటిజన్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరియు వీడియోను చూస్తున్నారు. ఇది సూపర్ అండ్ యూనిక్ మార్కెటింగ్ టెక్నిక్ అని పలువురు వ్యాఖ్యానించారు. డ్రోన్లు గ్రాఫిక్ డిజైన్ మరియు మార్కెటింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని మరొకరు వ్యాఖ్యానించారు. వైన్ రుచిని పెంచే డ్రోన్లు ఉన్నప్పుడు పండుగకు బాణసంచా ఎందుకు అవసరమని మరొకరు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం.. బోర్డియక్స్, నౌవెల్లె-అక్విటైన్ ప్రాంతంలో వార్షిక వైన్ ఫెస్టివల్ జూన్ 22-25 వరకు జరిగింది. ఈ నాలుగు-రోజుల పండుగ సందర్భంగా పండుగకు వెళ్లేవారు బోర్డియక్స్ ప్రాంతం నుండి అనేక రకాల వైన్‌లను తీసుకోవచ్చు. ఈ షోలో 400 డ్రోన్లు ఆకాశంలో వైన్ సర్వ్ చేస్తున్న చిత్రాన్ని రూపొందించి వీక్షకులను అలరించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..