AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇదెక్కడి కర్మ రా సామి..! ఆక్వేరియం లోపల టాయిలెట్.. చుట్టూ చేపల్ని చూస్తూ పని కానియొచ్చునట..!

రోజువారీ ఉపయోగంలో ఒకదాని వెనుక మరొకటి కొత్త కొత్త సాంకేతికతను రూపొందించడంలో జపాన్ ఎల్లప్పుడూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. జపాన్‌ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు మరో వీడియో వైరల్‌గా మారింది. జపాన్‌ అక్వేరియం లోపల టాయిలెట్‌ను నిర్మించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ హల్‌చల్‌ చేస్తోంది.

Watch: ఇదెక్కడి కర్మ రా సామి..! ఆక్వేరియం లోపల టాయిలెట్.. చుట్టూ చేపల్ని చూస్తూ పని కానియొచ్చునట..!
Aquarium F
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2023 | 7:13 PM

Share

ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నిరంతరం అసాధారణమైన భవనాలు, ఇళ్లు, గదులు, బాత్‌రూమ్‌లతో సహా అనేక రకాల నిర్మాణ వీడియోలను మనం చూస్తుంటాం. ఇవి ఆసక్తిని రేకెత్తిస్తాయి. దీని నిర్మాణ సౌందర్యం కూడా ప్రజలను మంత్రముగ్దులను చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చుట్టూ అక్వేరియంతో నిర్మించి ఉన్న జపాన్‌ టాయిలెట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాంకేతికత, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడంలో జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. రోజువారీ ఉపయోగంలో ఒకదాని వెనుక మరొకటి కొత్త కొత్త సాంకేతికతను రూపొందించడంలో జపాన్ ఎల్లప్పుడూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. జపాన్‌ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు మరో వీడియో వైరల్‌గా మారింది. జపాన్‌ అక్వేరియం లోపల టాయిలెట్‌ను నిర్మించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ హల్‌చల్‌ చేస్తోంది.

జపాన్ హిప్పోపాప కేఫ్‌లో అక్వేరియం టాయిలెట్ ఉంది. ఇది ఈ కేఫ్ కస్టమర్‌లకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. కేఫ్ లోపల టాయిలెట్ చుట్టూ గాజు గోడలు, నీరు, చేపలతో నిండి ఉంది..ఇక దీంతో కొందరు కస్టమర్లు నేచర్‌ కాల్‌ కోసం వెళ్లిన క్రమంలో తమను తాము మర్చిపోయి ఎక్కువ సేపు టాయిలెట్లో గడిపుతున్నారట. మరి కొందరు మాత్రం సిగ్గుతో ఆక్వేరియంను చూసి అలాగే బయటకు వచ్చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఈ వీడియో గత సంవత్సరం పోస్ట్ చేయబడింది. కాగా, ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోని వీక్షించారు. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ చేశారు. మరికొందరు ఇదెక్కడి పైత్యంరా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జపాన్ టెక్నాలజీని మెచ్చుకోవాల్సిందేనంటున్నారు మరికొందరు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..