AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుష్ప’సినిమాను మించిన స్మగ్లింగ్‌ స్టైల్‌ ఇది.. కన్నంలో దాగిన కంత్రీగాళ్ల గుట్టురట్టు..

పుష్ప సినిమాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కొరకు చేసిన రకరకాల సన్నివేశలను ఆదర్శంగా తీసుకున్న కొంతమంది అవే సీన్స్‌ని కాపీ కొడుతూ గుట్టుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సాగుతున్న మద్యం అక్రమ రవాణాతో చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

'పుష్ప'సినిమాను మించిన స్మగ్లింగ్‌ స్టైల్‌ ఇది.. కన్నంలో దాగిన కంత్రీగాళ్ల గుట్టురట్టు..
Liquor Scam
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2023 | 6:38 PM

Share

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్పా సినిమా అందరికీ తెలిసిందే..పుష్ఫ అనగానే ప్రతి ఒక్కరికీ టక్కున్న గుర్తుకు వచ్చేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు. ఈ స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. కానీ.. అదే సినిమాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కొరకు చేసిన రకరకాల సన్నివేశలను ఆదర్శంగా తీసుకున్న కొంతమంది అవే సీన్స్‌ని కాపీ కొడుతూ గుట్టుగా మద్యం అమ్మకాలు సాగిస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు, అధికారుల కంటపడకుండా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాగుతున్న మద్యం అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేశారు సెబ్ పోలీసులు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టెందుకు ఎమ్మిగనూరు, మంత్రాలయం,మండలల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

పుష్ప సినిమాలో సన్నివేశాలను కాపీ కొట్టిన కొందరు అక్రమార్కులు తమ వ్యాపారం కోసం ఒక పెద్ద షెడ్డు మాదిరిగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ షెడ్డుకు ఒక చిన్న సొరంగం ఏర్పాటు చేసి అందులో లిక్కర్ దాచి గుట్టుగా అమ్ముకుంటున్నారు. మరొకరు బట్టల వ్యాపారం చేస్తునట్టుగా నమ్మించి..బాక్స్ ల్లో మద్యం తరలిస్తుండగా సెబ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 90 ML కర్ణాటక మద్యం 1038 టేట్రా ప్యాకెట్లు సిజ్ చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుపడ్డ మొత్తం మద్యం విలువ 55 వేల రూపాయలు గా ఉంటుందని సెబ్ సీఐ జయరాం నాయుడు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే