Konaseema: పొలం బాట పట్టిన కోనసీమ రైతులు.. పొలంలోకి దిగి చేయి కలిపిన జిల్లా కలెక్టర్..
Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలకరి జల్లులు పడడంతో తొలకరి పంటలకు సిద్ధమవుతున్నారు కోనసీమ రైతులు. మొన్నటి వరకు వేసవితో ఇంటి పట్టునే ఉన్న రైతులు వర్షాలు ప్రారంభం కావడంతో పలుకు, పార చేతబట్టి పొలాలను..
Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలకరి జల్లులు పడడంతో తొలకరి పంటలకు సిద్ధమవుతున్నారు కోనసీమ రైతులు. మొన్నటి వరకు వేసవితో ఇంటి పట్టునే ఉన్న రైతులు వర్షాలు ప్రారంభం కావడంతో పలుకు, పార చేతబట్టి పొలాలను సేద్యం చేసేందుకు సిద్ధమయ్యారు. పొలంలో నారుమడులు వేసి ఉడ్పులకు ఉడ్చేందుకు వరి నారుమళ్లు వేయడం కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా పొలంలోకి దిగి రైతులతో కలిసి వరి విత్తనాలు చల్లారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమన్సు శుక్లా. అనంతరం మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయసహకారాలు ఉంటాయన్నారు.
అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తోందని, వైఎస్సార్ యంత్ర సేవ ద్వారా ఆధునిక వ్యవసాయ పనిముట్లను సన్న చిన్న కారు రైతులకు తక్కువ ధరలకే అందించడం జరుగుతుందన్నారు. రైతులకు ఎన్నడూ లేని విధంగా జూన్ నెల 1వ తేదీ నుంచే కాలువలకు నీటిని విడుదల చేయడం జరిగిందని, రైతులు అందరూ సకాలంలో పంటలు వేసుకోవాలని ఈ సంద్భంగా కర్షక వర్గాలకు జిల్లా కలెక్టర్ హిమన్సు శుక్లా సూచించారు.
-వెంకటేష్, టీవీ9 రిపోర్టర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.