Women’s Ashes: అబ్బాయిలే కాదు, అమ్మాయిలూ అద్దరగొట్టేశారు.. ఇంగ్లాండ్‌పై ఆసీస్ విజయం.. బ్యూమాంట్ డబుల్ సెంచరీ వృథా..
Women’s Ashes 2023: క్రికెట్ ఆడడంలో అబ్బాయిలే కాదు, అమ్మాయిలూ తక్కువేమీ కాదని నిరూపించారు ఆస్ట్రేలియన్ మహిళా ప్లేయర్లు. ఇటీవలే ప్రారంభమైన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను తొలి మ్యాచ్‌లోనే ఓడించి శుభారంభంతో..
Women’s Ashes 2023: క్రికెట్ ఆడడంలో అబ్బాయిలే కాదు, అమ్మాయిలూ తక్కువేమీ కాదని నిరూపించారు ఆస్ట్రేలియన్ మహిళా ప్లేయర్లు. ఇటీవలే ప్రారంభమైన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను తొలి మ్యాచ్‌లోనే ఓడించి శుభారంభంతో కంగారుల మెన్స్ టీమ్ ముందడుగు వేయగా.. ఇంగ్లీష్ మహిళలతో జరిగిన ఏకైక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ అమ్మాయిలు కూడా విజయ పతాకం ఎగురవేశారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జూన్ 22న ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్‌పై ఆస్ట్రేలియన్ మహిళల జట్టు 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక తొలి ఇన్సింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లతో ఇంగ్లాండ్ మహిళలపై విరుచుకుపడిన ఆష్లే గార్డనర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
మ్యాచ్ వివరాల్లోకెళ్తే.. అన్నాబెల్ సదర్లాండ్ సెంచరీ(137, నాటౌట్), ఎల్లీ్స్ పెర్రీ 99 పరుగుల ఆద్భుత ఆటతో ముందుగా బ్యాటింగ్ చేసిన కంగారుల అమ్మాయిలు తొలి ఇన్నింగ్స్‌లో 473 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లీష్ అమ్మాయిలు కూడా 463 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లాండ్ తరఫున తమ తొలి ఇన్నింగ్స్‌లో టామీ మ్యూమాంట్ 208 పరుగల డబుల్ సెంచరీతో రాణించగా.. నాట్‌స్కివర్ బ్రంట్ 78 రన్స్‌తో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అనంతరం కేవలం 10 పరుగులు ఆధిక్యంతో మూడో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఉమెన్స్ 257 పరుగులకే పరిమితమయ్యారు. ఈ ఇన్సింగ్స్‌లో కంగారుల తరఫున బెత్ మూనీ 85, కెప్టెన్ హేలీ 50 పరుగులతో రాణించగా, లిచ్‌ఫీల్డ్ 46 రన్స్‌తో పర్వాలేదనిపించింది. దీంతో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 267 పరుగుల లీడ్ సాధించింది.
అలా 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ని ఆసీస్ ప్లేయర్ ఆష్లే గార్డనర్ కట్టడి చేసింది. ఏకంగా 8 వికెట్లు తీసి ఇంగ్లీష్ టీమ్‌ని 178 పరుగులకే పరిమితమయ్యేలా చేసింది. దీంతో ఆసీస్ అమ్మాయిలు.. ఇంగ్లాండ్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇంకా ఈ మ్యాచ్ ద్వారా ఆష్లే గార్డనర్ 10 వికెట్ల ఘనతను కూడా అందుకుంది. రెండు ఇన్నింగ్స్‌లో 12 (4, 8) వికెట్లు తీసిన ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. మరోవైపు ఇంగ్లాండ్‌పై సాధించిన ఈ విజయంతో.. ఆస్ట్రేలియా అమ్మాయిల ఖాతాలో ప్రస్తుతం వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్‌కప్, కామన్‌వెల్త్ గేమ్స్ టైటిల్, యాషెస్ అర్న్ ఉన్నాయి.
Australia In Women’s Cricket:
•Most ODI WC Trophies, Most T20 WC Trophies, Most CWG & Most Ashes Test Trophies.
•Current Champions of ODI WC, T20 WC, CWG & Womens Ashes Test.
•Most wins in ODIs, 2nd Most wins in T20Is & Most wins in Tests.
UNBELIEVABLE DOMINATION. pic.twitter.com/CCL3W92hrR
— CricketMAN2 (@ImTanujSingh) June 26, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..