AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జున సాగర్ లో పాగా వేసిన బీఆర్ఎస్ కు సొంత పార్టీ నుంచే చిక్కులు.. మారిన రాజకీయ పరిణామాలు

జానా రెడ్డి పై 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుండి నోముల నర్సింహయ్య గెలవడం అనారోగ్య కారణం తో అయన చనిపోయాక దుబ్బాక మాదిరిగానే కుటుంబానికే టిక్కెట్ ఇచ్చారు గులాబీ బాస్ కెసిఆర్. నర్సింహయ్య కొడుకు భగత్ కు టిక్కెట్ కేటాయించారు. అయితే, అప్పడూ కూడా టికెట్టు కోసం చాల మంది నేతలు పోటీ పడినా భగత్ కు ఇవ్వడం తో అందరు కలిసి పనిచేసి గెలిపించుకున్నారు.

నాగార్జున సాగర్ లో పాగా వేసిన బీఆర్ఎస్ కు సొంత పార్టీ నుంచే చిక్కులు.. మారిన రాజకీయ పరిణామాలు
CM KCR
Sridhar Prasad
| Edited By: Narender Vaitla|

Updated on: Jun 27, 2023 | 7:12 PM

Share

జానా రెడ్డి కంచుకోట నాగార్జున సాగర్ లో పాగా వేసిన బీఆర్‌ఎస్‌కు సొంత పార్టీ గ్రూపులతో చిక్కులు తప్పడం లేదు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే నిజమే అనిపిస్తుంది. నాగార్జున సాగర్ లో జానా రెడ్డి పై 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుండి నోముల నర్సింహయ్య గెలవడం అనారోగ్య కారణం తో అయన చనిపోయాక దుబ్బాక మాదిరిగానే కుటుంబానికే టిక్కెట్ ఇచ్చారు గులాబీ బాస్ కెసిఆర్. నర్సింహయ్య కొడుకు భగత్ కు టిక్కెట్ కేటాయించారు. అయితే, అప్పడూ కూడా టికెట్టు కోసం చాల మంది నేతలు పోటీ పడినా భగత్ కు ఇవ్వడం తో అందరు కలిసి పనిచేసి గెలిపించుకున్నారు.

అయితే ఉప ఎన్నిక సమయం లోనే రెడ్డి సామాజిక వర్గం నుండి ఎంసీ కోటిరెడ్డి టికెట్‌ ఆశించగా యాదవ కమ్యూనీటి నుండి కట్టబోయిన గురువయ్య యాదవ్ తో పాటు రంజిత్ యాదవ్ తో గట్టి ప్రయత్నాలు చేసారు. కోటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులు ఉండగా గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్‌ల కు ఎంపీ లింగయ్య యాదవ్ మద్దతు ఉంది అని సమాచారం. కాగా, కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బుజ్జగించినా రాబోయే ఎన్నికల్లో మాత్రం నోముల భగత్ కు తిరిగి టిక్కెట్టు ఇవ్వొద్దు అంటూ సాగర్ నాయకత్వం అంతా లాబీయింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం.

సాగర్‌లో జానా రెడ్డి మల్లి పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్ మినహా ఎమ్మెల్సీ కోటి రెడ్డితో సహా మిగితా బీఆర్‌ఎస్‌ నాయకత్వం అంత ఏకం అయినట్టు తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి టిక్కెట్ ఇస్తే ఎమ్మెల్సీ కోటి రెడ్డికి, యాదవ సామాజిక వర్గానికి ఇస్తే గురువయ్య యాదవ్ లేదా రంజిత్ యాదవ్ కు టిక్కెట్ ఇవ్వాలి అని ఒక అవగాహన తో నేతలు అంత ఒక్కటయినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరి సాగర్ నేతలు ఇంత క్లారిటీగా ఒక్క టీంగా తయారయ్యారు. కాబట్టి ఇప్పడు టికెట్ విషయం లో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారొ చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.