AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. పొమ్మనక పొగ పెడుతున్నారా? సీనియర్ల ఫిర్యాదు పై అధిష్టానం ఏం చేయబోతుంది?

కొత్త చేరికలతో జోరుమీదున్న తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కలవరం మొదలైందా...? ఆ నేతల పై దుష్ప్రచారం చేస్తున్నది ఎవరు..? సొంత పార్టీ నేతల తీరు పై అసంతృప్తి ఉన్న ఆ సీనియర్ నేతలు కి అధిష్టానం ఇచ్చిన హామీ ఏంటి...? ఆ నేతల పిర్యాదు తో చర్యలు తీసుకుంటారా...? ఎన్నికల వేల కలిసి పని చేస్తారా...? గ్రూపు లతో నష్టం కలిగిస్తారా...?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. పొమ్మనక పొగ పెడుతున్నారా? సీనియర్ల ఫిర్యాదు పై అధిష్టానం ఏం చేయబోతుంది?
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 27, 2023 | 7:33 PM

Share

కొత్త చేరికలతో జోరుమీదున్న తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కలవరం మొదలైందా…? ఆ నేతల పై దుష్ప్రచారం చేస్తున్నది ఎవరు..? సొంత పార్టీ నేతల తీరు పై అసంతృప్తి ఉన్న ఆ సీనియర్ నేతలు కి అధిష్టానం ఇచ్చిన హామీ ఏంటి…? ఆ నేతల పిర్యాదు తో చర్యలు తీసుకుంటారా…? ఎన్నికల వేల కలిసి పని చేస్తారా…? గ్రూపు లతో నష్టం కలిగిస్తారా…? కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చిన భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.. అధికార బిఆరెస్ కి తామే ప్రత్యామ్నాయం అనుకుంటున్న కాంగ్రెస్ లో కొత్త చిచ్చు మొదలైంది.. మాజీ పిసిసి అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై సొంత పార్టీ నేతలే తనని టార్గెట్ చేసి బిఆరెస్ లోకి వెళ్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని అధిష్టానానికి పిర్యాదు చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి కూడా పిర్యాదు చేసినట్లు సమాచారం.. ఓ మీడియా ఛానెల్ తో పాటు కొన్ని పత్రికలు తాను పార్టీ మారుతున్న అంటూ చేస్తున్నా ప్రచారం వెనుక రేవంత్ హస్తం ఉందంటూ ఉత్తమ్ మండిపడ్డారు.. మరోవైపు జగ్గారెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పార్టీ కోసం తాను ఎంతో చేసానని అయినా తనని కోవర్ట్ ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తనపై కోవర్ట్ ముద్ర తొలగించుకోవడానికి ప్రతిసారి శీల పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్ని రాహుల్ గాంధీ కి వివరిస్తానన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై గత కొంతకాలంగా వార్ రూమ్ కేంద్రంగా దుష్ప్రచారం చేస్తున్నారని అది కాంగ్రెస్ పార్టీకి సంబందించిన నేతలే అని గతంలో ఆయన పోలీస్ స్టేషన్ లో సైతం పిర్యాదు చేశారు.. గతంలో సేవ్ కాంగ్రెస్ పేరుతో బట్టి ఇంట్లో సీనియర్ నేతల సమావేశం జరిగినప్పుడు సైతం రేవంత్ పై ఉత్తమ్ ఫైర్ అయ్యారు..

రాష్ట్ర పార్టీలో కొత్త మంది వ్యవహరిస్తున్న తిరుపై అధిష్టానానికి 10 పేజీల లేఖను రాశారు.. అధిష్టానం ఎన్నికల వేల అందరిని కలుపుకుపోవాలని రేవంత్ కి సూచనలు చేసింది.. దీంతో గతంలో అంటిముట్టనట్టుగా ఉన్న కోమటిరెడ్డి, రేవంత్ చేరికల విషయంలో ఇద్దరు కలిసి పొంగులేటి, జూపల్లి ఇంటికి వెళ్లి తామంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు.. ఇంతలోనే ఉత్తమ్ కామెంట్స్ చర్చనీయంశంగా మారింది. ఎన్నికల వేల గ్రూప్ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నందున నేతల మధ్య సమన్వయం చేయడం తో పాటు ఉత్తమ్ పిర్యాదు పై అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..