Vaastu Tips: వాస్తు ప్రకారం ఈ వస్తువులు అప్పుగా ఇచ్చినా, తీసుకున్న కష్టాలే..! తస్మాత్‌ జాగ్రత్త..

వాస్తు శాస్త్రం ప్రకారం.. పై వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఇది మన జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. ఇది మీ జీవితంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.

Vaastu Tips: వాస్తు ప్రకారం ఈ వస్తువులు అప్పుగా ఇచ్చినా, తీసుకున్న కష్టాలే..! తస్మాత్‌ జాగ్రత్త..
Vaastu Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2023 | 3:34 PM

మనం స్నేహితులు, బంధువులతో ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. అవసరమైన సమయాల్లో డబ్బు, బట్టలు మొదలైనవి అడుగుతాం. కానీ చాలామందికి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదో తెలియదు. కొన్నిసార్లు మనకు కావాల్సిన వస్తువులు సరైన సమయంలో లభించవు. అవి లేనప్పుడు మనం వేరొకరిని అడుగుతాము. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం కొన్ని వస్తువులను అప్పుగా తీసుకుంటే మనకు భారీ నష్టాలు రావచ్చునని చెబుతున్నారు. ఇది మన రోజువారీ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం ఏయే వస్తువులు అరువు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

బట్టలు, గడియారాలు

జ్యోతిష్యం ప్రకారం ఎవరైనా ఉపయోగించిన దుస్తులను ఎప్పుడూ ధరించకూడదు. అలా చేయడం వల్ల మీకు శారీరక సమస్యలు ఏర్పడవచ్చు. స్నేహితులతో సంబంధాలు చెడిపోవచ్చు. వేరొకరి గడియారాన్ని(వాచ్‌)కూడా ఎప్పుడూ ధరించవద్దు. ఇలా చేయడం ఇబ్బందులను ఆహ్వానించడమే. వారి చెడు సమయం మీకు వర్తిస్తుంది.

రుమాలు, పెన్ను

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక స్నేహితుడు లేదా బంధువు నుండి రుమాలు అప్పుగా తీసుకోకూడదు. అలా చేయడం వలన స్నేహితుడు లేదా బంధువుతో సంబంధం చెడిపోతుంది. అలాగే, ఇతరుల నుండి పెన్ను తీసుకోవద్దు. శాస్త్రం ప్రకారం కలం ఒక వ్యక్తి మంచి, చెడు పనులను ట్రాక్ చేస్తుంది. దీని ద్వారా వారి మంచి, చెడు కర్మల ఫలాలు మీకు వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఉంగరం, చెప్పులు, బూట్లు

వేరొకరి ఉంగరం ధరించవద్దు. కొన్ని ఉంగరాలు రత్నం గ్రహంతో ముడిపడి ఉన్నందున అది మీకు అనుకూలంగా ఉందో లేదో చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వెరొకరు వాడిన చెప్పులు, బూట్లను కూడా ధరించవద్దు. వాస్తు శాస్త్రంలో ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది.

మంచం, చీపురు

వేరొకరి మంచాన్ని ఉపయోగించడం కలహాలకు కారణం అవుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య బంధంలో చీలిక వస్తుంది. అలాగే చీపురు ఇంటి లక్ష్మిగా అంటారు. మీరు వేరొకరి ఇంటి నుండి చీపురు తీసుకుంటే, మీ ఇంటివారు లక్ష్మితో కలత చెందుతారు. కాబట్టి చీపురు ఎప్పుడూ అరువు తీసుకోకండి.

ఉప్పు

సాధారణంగా మనం వంటగదిలో సామాగ్రి అయిపోతే, వాటిని ఇరుగుపొరుగు వారిని అడిగి తీసుకుంటాము. కానీ ఉప్పును అప్పుగా తీసుకుంటే అప్పులపాలు కావొచ్చునని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం ఉప్పు ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. దానం కూడా చేయకూడదు. ఇది మీ జీవితంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ఎవరికీ ఉప్పు ఇవ్వవద్దు. ఎవరి నుండి ఉప్పు తీసుకోవద్దు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. పై వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఇది మన జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు దీన్ని దృవీకరించడంలేదు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి