Copper Vessels: రాగి పాత్రల్లో నీరు తాగడం అలవాటా? ఈ తప్పులు చేస్తున్నారేమో జాగ్రత్త! అసలుకే మోసం వస్తుంది..
ఇటీవల కాలంలో కూడా ప్రజలు ఈ రాగి పాత్రలను వినియోగిస్తున్నారు. అయితే వాటిని వాడేటప్పుడు కొన్ని తప్పులు సాధారణంగా చేస్తుంటారు. వాటిని కచ్చితంగా తెలుసుకొని మార్చుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

మన దేశం వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం మాత్రమే కాదు.. అనేక రకాల ఆరోగ్య జీవన విధానాలను, పద్ధతులను , చికిత్సా విధానాలకు ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప చారిత్రక నేపథ్యం. ముఖ్యంగా ఆయుర్వేదం, యోగా వంటి పద్ధతులు పురాతన కాలం నుంచి మన పెద్దలు వాటిని ఆచరిస్తున్నారు. ఇప్పుడు అవి విశ్వవ్యాప్తం అయ్యాయి. అలాగే మనకు ఇప్పుడు సౌకర్యాలు, సాంకేతిక సాయం లేని సమయంలో చాలా పాత కాలం పద్దతుల్లో ఆరోగ్య విధానాలు పాటించేవారు. ముఖ్యంగా తాగే నీటి విషయంలో ఇప్పుడంటే అందరూ ఫిల్టర్లు, ఆర్ఓ ప్లాంట్లను వినియోగిస్తున్నారు. అయితే పురాతన కాలంలో రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేసి దాని నుంచి తాగేవారు. ఇటీవల కాలంలో కూడా ప్రజలు ఈ రాగి పాత్రలను వినియోగిస్తున్నారు. అయితే వాటిని వాడేటప్పుడు కొన్ని తప్పులు సాధారణంగా చేస్తుంటారు. వాటిని కచ్చితంగా తెలుసుకొని మార్చుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఇదే విషయాల గురించి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ మోహిత్ గుప్తా వివరించారు. తన ఇన్ స్టాగ్రామ్ పేజీపై రాగి పాత్రల్లో నీరు తాగే వారు సాధారణంగా చేసే తప్పుల గురించి రాశారు. వాటి ద్వారా కలిగే ఇబ్బందులు కూడా పేర్కొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇవి కూడా చదవండిView this post on Instagram
రోజంతా రాగి పాత్రలోనివి తాగడం.. రాగి పాత్ర లేదా రాగి బాటిల్ నిల్వ చేసిన నీరు మాత్రమే రోజంతా తాగితే ప్రమాదకరమని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు. ఎందుకంటే రోజంతా కాపర్ బాటిల్ లో నీరు ఉంచితే అధికశాతం కాపర్ నీటిలోకి చేరిపోతుందని.. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వివరించారు. అంతేకాక ఎక్కువ కాలం ఇలా కేవలం రాగి పాత్రలోని నీరు తాగుతూ ఉంటే కాపర్ టాక్సిసిటీ అంటే ఆ నీరు ఓ రకమైన విషంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల వాంతులు, కడుపులో నొప్పి, మగతగా ఉండటం.. ఇంకా ఎక్కువ అయితే లివర్, కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
నిమ్మ, తేనె కలిపిన నీరు.. సాధారణంగా మనం పరగడుపున నీటిలో నిమ్మరసం, తేనేతో కలుపుకొని తాగుతుంటాం. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ కాంబినేషన్ కు మాత్రం రాగి పాత్రలను వినియోగించవద్దని డాక్టర్ గుప్తా చెబుతున్నారు. వాస్తవానికి నిమ్మకాయ ఆమ్లం. అది రాగితో ప్రతిచర్య చేస్తుంది. దీని వల్ల కడుపునొప్పి, గ్యాస్ సమస్యలతో పాటు వాంతులు కూడా అయ్యే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.
రాగి బాటిల్స్ ను కడిగే విధానం.. రోజూ వినియోగించే రాగి బాటిల్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. వినియోగించిన ప్రతి సారి నీటిలో బాగా జాడించి క్లీన్ చేయాలి. అలాగే ప్రతి 30 రోజులకు ఒకసారి సాల్ట్, నిమ్మకాయ వేసి శుభ్రం చేసుకోవాలి. ఇది ఆక్సీకరణను నిరోధిస్తుంది. నీటిని నిల్వ చేసే ఏ రాగి పాత్రలో అయినా ఇది సాధారణంగా జరుగుతుంది. అందుకే క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







