ఒకే స్కూటీపై ఏడుగురు పిల్లలతో జామ్‌ జామ్‌గా చక్కర్లు కొట్టాడు…వీడియో వైరల్ కావడంతో తిక్క కుదిరింది..!

ఒక స్కూటర్‌పై ఏడుగురు పిల్లలతో ఒక వ్యక్తి రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునావర్ షా అతని నలుగురు పిల్లలు, మరో ముగ్గురు పిల్లలు మొత్తం 7 మంది పిల్లలను స్కూల్ నుంచి ఈ స్కూటర్‌పై తీసుకొచ్చి దింపుతున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో..

ఒకే స్కూటీపై ఏడుగురు పిల్లలతో జామ్‌ జామ్‌గా చక్కర్లు కొట్టాడు...వీడియో వైరల్ కావడంతో తిక్క కుదిరింది..!
Scooter
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2023 | 9:01 PM

డబుల్ రైడ్ చూస్తాం, ట్రిపుల్ రైడ్ చూస్తుంటాం..కానీ, ఇక్కడ ఒక స్కూటర్‌పై ఏకంగా 8 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. ఒక స్కూటర్‌పై ఏడుగురు పిల్లలతో ఒక వ్యక్తి రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునావర్ షా అతని నలుగురు పిల్లలు, మరో ముగ్గురు పిల్లలు మొత్తం 7 మంది పిల్లలను స్కూల్ నుంచి ఈ స్కూటర్‌పై తీసుకొచ్చి దింపుతున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు మునవర్ షాను అరెస్ట్ చేశారు. భారీ జరిమాన కూడా విధించారు. మునవాష్ షాకు నలుగురు పిల్లలు. మానవాష్ షా ముగ్గురు పిల్లలను ఇరుగుపొరుగు ఇంటి నుండి పాఠశాలకు తీసుకువెళతాడు. మునవర్ షా నగరంలోని ప్రధాన రహదారిపై 7 మంది పిల్లలతో స్కూటర్‌పై వెళ్తుండగా కొందరు వీడియో తీశారు. అంతేకాదు..మునవర్ షాకు ఎంత నిర్లక్ష్యం అంటే.. తలకు హెల్మెట్ కూడా లేదు.

చిన్నారులతో కలిసి రైడ్ చేస్తున్న సమయంలో ఇతర ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. మునవర్ షాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ వీడియో ఆధారంగా ముంబై పోలీసులు యాక్టివ్ అయ్యారు. సీసీటీ ఫుటేజీ ఆధారంగా మునవర్‌ ను అదుపులోకి తీసుకున్నారు. మునావర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ జరిమానా విధించారు.

ఇవి కూడా చదవండి

పిల్లల భద్రత, ఇతర వాహనదారుల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు అన్నీ స్కూటర్ రైడింగ్ తో గాలికి వదిలేశాడు.. దీంతో ముంబై పోలీసులు ఈ కేసును సీరియస్‌గా పరిగణించారు. ఐపీసీ 308 కింద కేసు నమోదు చేశారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. దీంతోపాటు ఖరీదైన జరిమానాలు విధిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, వన్ వే రైడింగ్ సహా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీ రెట్టింపు చేయబడింది. ప్రధానంగా భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..