Business Ideas: వంటగదిలో 2 గంటలు కష్టపడితే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు రూ. లక్ష వరకు ఆదాయం.!
ఉద్యోగం కోసం వెతికి.. వెతికి.. విసిగిపోయారా.? ఎక్కడా ఏం దొరకట్లేదా..! దాని బదులు మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే..
ఉద్యోగం కోసం వెతికి.. వెతికి.. విసిగిపోయారా.? ఎక్కడా ఏం దొరకట్లేదా..! దాని బదులు మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. మీకోసం మంచి బిజినెస్ ఐడియాను ముందుకు తీసుకొచ్చేశాం. ఇదొక లో-బడ్జెట్ బిజినెస్.. ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు.. ఒక్కసారి క్లిక్ అయితే.. లక్షల్లో లాభాలు పొందొచ్చు. మరి ఇంతకీ ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!
అదే క్యాటరింగ్ బిజినెస్. ఈ మధ్యకాలంలో దీనికి మంచి గిరాకీ ఉంది. ఇటీవల ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ ఏదొక ఫంక్షన్ జరుగుతోంది. ఇక వారంతా భోజనాలు బయట నుంచి ఆర్డర్ ఇస్తున్నారు. కాబట్టే ఈ క్యాటరింగ్ బిజినెస్‌కు మంచి డిమాండ్ ఉంది. కేవలం రూ. 10 వేలతో దీన్ని ప్రారంభించవచ్చు. అనంతరం నెలకు రూ. 25-50 వేల వరకు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఒక్కసారి ఈ బిజినెస్ అభివృద్ధి చెందాక.. సుమారు రూ. లక్ష వరకు లాభాన్ని పొందొచ్చు.
క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించడానికి రేషన్, ప్యాకేజింగ్ వస్తువులు అవసరం అవుతాయి. గ్యాస్ సిలిండర్, వంట సామాన్లు, మొదలైనవి.. వీటన్నింటికీ రూ. 10 వేల వరకు ఖర్చవుతుంది. అలాగే మీ ఇంట్లో ఓ పెద్ద వంటగది ఉంటే సరిపోతుంది. చిన్నగా మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి.. చుట్టుప్రక్కల వాళ్లు, ఫ్రెండ్స్, ఆన్‌లైన్ ద్వారా ప్రచారాన్ని చేయండి. మీ క్వాలిటీ, క్వాంటిటీ గురించి అందరికీ తెలిస్తే.. నెమ్మదిగా బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. క్రమేపీ ఆర్డర్లు ఎక్కువ వస్తుంటాయి. కాగా, ఈ బిజినెస్ ప్రారంభమైన మొదట్లో.. మీకు నెలకు రూ. 25 వేల వరకు లాభం రావచ్చు. ఆ తర్వాత అది అభివృద్ధి అయిన వెంటనే.. ప్రతీ నెలా కనీసం నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదన వస్తుంది.