Cancelled Trains List: సికింద్రాబాద్‌ రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. నేడు, రేపు, ఎల్లుండి పలు రైళ్ల రద్దు

ట్రాక్‌ నిర్వహణ పనులు భద్రక్‌-ఖరగ్‌పూర్‌ సెక్షన్‌ బహనగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరుగుతున్నాయి. ఈ కారణంగా నేటి నుంచి వరుసగా మూడు రోజులు ట్రైన్లు రద్దయ్యాయి. ఈ మేరకు జూన్‌ 28, 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేరు..

Cancelled Trains List: సికింద్రాబాద్‌ రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. నేడు, రేపు, ఎల్లుండి పలు రైళ్ల రద్దు
Cancelled Trains Today
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2023 | 8:14 AM

హైదరాబాద్‌: ట్రాక్‌ నిర్వహణ పనులు భద్రక్‌-ఖరగ్‌పూర్‌ సెక్షన్‌ బహనగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరుగుతున్నాయి. ఈ కారణంగా నేటి నుంచి వరుసగా మూడు రోజులు ట్రైన్లు రద్దయ్యాయి. ఈ మేరకు జూన్‌ 28, 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎకె త్రిపాఠి మంగళవారం (జూన్‌ 27) తెలిపారు. దాదాపు 12 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు.

జూన్‌ 28న రద్దయ్యే ట్రైన్ల వివరాలు..

  • హావ్‌డా-సత్యసాయి ప్రశాంతి నిలయం (22831)
  • హైదరాబాద్‌-షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌
  • షాలిమార్‌-సికింద్రాబాద్‌ (22849)
  • షాలిమార్‌-సికింద్రాబాద్‌(12773)
  • విశాఖ-షాలిమార్‌(22854)
  • తాంబరం-సంత్రాగచ్చి (22842)
  • పుదుచ్చేరి-హావ్‌డా(12868)
  • చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ (22826)

జూన్‌ 29న రద్దయ్యే ట్రైన్ల వివరాలు..

  • ఎస్‌ఎంవీ బెంగళూరు-హావ్‌డా (22888)
  • చెన్నై సెంట్రల్‌- సంత్రాగచ్చి (22808)

జూన్‌ 30న రద్దయ్యే ట్రైన్లు ఇవే..

  • సత్యసాయి ప్రశాంతి నిలయం-హావ్‌డా (22832)
  • సికింద్రాబాద్‌-షాలిమార్‌ (22850)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.