LPG Gas Booking Via WhatsApp: గ్యాస్ సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలా..? వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితేచాలు..

ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ ఇకపై వాట్సప్‌ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు తాజాగా కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టాయి. వాట్సప్‌ ద్వారా హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌, ఇండెన్‌.. వంటి పలు కంపెనీల గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్ చేసుకునే వెలుసుబాటు..

LPG Gas Booking Via WhatsApp: గ్యాస్ సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలా..? వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితేచాలు..
LPG Gas Booking
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2023 | 6:50 AM

హైదరాబాద్: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ ఇకపై వాట్సప్‌ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు తాజాగా కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టాయి. వాట్సప్‌ ద్వారా హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌, ఇండెన్‌.. వంటి పలు కంపెనీల గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్ చేసుకునే వెలుసుబాటు కల్పించాయి. సాధారణంగా గ్యాస్‌ వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీ నంబర్ లేదా ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ చేయడం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లను బుక్ చేసుకుంటుంటారు. ఇందుకోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ, లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ చేస్తూ వినియోగదారులు ప్రయాసపడుతుంటారు. రీఫిల్‌ బుకింగ్‌ సులభతరం చేసేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు చమురు సంస్థలు తెలిపాయి.

తాజాగా ప్రవేశ పెట్టిన కొత్త విధానం ద్వారా సదరు కంపెనీ వాట్సాప్ నంబర్‌కు నేరుగా ఒక్క మెసేజ్‌ పెట్టి సిలిండర్‌ సులువుగా బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త కలెక్షన్‌ కూడా వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు. అందుకు వాట్సప్‌లో కొత్త కనెక్షన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు..! ఐతే గ్యాస్‌ వినియోగదారుల కోసం వాట్సాప్‌ సేవలు తీసుకొచ్చినా వినియోగించే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 42 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిల్లో యూపీఐ డిజిటల్‌ వ్యాలెట్‌ ద్వారా 15 శాతం, ఫోన్‌కాల్స్‌ ద్వారా 75 శాతం, వెబ్‌సైట్‌ వంటి ఇతర పద్ధతుల ద్వారా 10 శాతం మంది వినియోగించుకుంటున్నారు. వినియోగదారులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే వాట్సప్‌ సేవలు వినియోగించుకోలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆయిల్‌ కంపెనీల వాట్సాప్‌ నంబర్లతో క్షణాల్లో రీఫిల్‌ బుకింగ్‌ ఎలా చేసుకోవాలంటే..

మీరు హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులైతే.. హెచ్‌పీ వాట్సాప్‌ నంబరు 92222 01122లో Bi అని టైప్‌చేసి సెండ్‌ చేయాలి. ఆ త్వరాత వచ్చే మెనూలో పలురకాల సేవలు వస్తాయి. వాటిల్లో అవసరమైన ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ‘సువిధ’ ఎంపిక త్వారా కొత్త కనెక్షన్‌, కనెక్షన్‌ తొలగింపు వంటి సేవలు పొందొచ్చు. అలాగే ఇండేన్‌ కంపెనీ వాట్సప్‌ నెంబర్ 75888 88824, భారత్‌ గ్యాస్‌ వాట్సప్‌ నెంబర్‌ 18002 24344.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.