Watch Video: ఉచిత ప్రయాణం తెచ్చిన తంటా..! వృద్ధురాలి గూబ పగలగొట్టిన ఆర్టీసీ బస్‌ కండక్టర్

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన 'శక్తి పథకం' రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది. ఈ పథకం ద్వారా ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి..

Watch Video: ఉచిత ప్రయాణం తెచ్చిన తంటా..! వృద్ధురాలి గూబ పగలగొట్టిన ఆర్టీసీ బస్‌ కండక్టర్
KSRTC Bus Conductor slaps old woman
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2023 | 11:14 AM

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ‘శక్తి పథకం’ రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది. ఈ పథకం ద్వారా ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నప్పటికీ.. కొన్ని చోట్ల మహిళల పట్ల రవాణా శాఖ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేఎస్ఆర్టీసీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ప్రజల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిపై కర్ణాటక ఆర్టీసీ బస్‌ కండక్టర్‌ చేయి చేసుకోవడం చర్చణీయంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కేఎస్‌ఆర్ టీసీ సిబ్బంది ప్రయాణికులతో వాగ్వాదానికి దిగడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో గత శుక్రవారం (జూన్‌ 23) కర్ణాటకలోని హుబ్బళి బస్సులో ఓ వృద్ధ మహిళను మహిళా కండక్టర్‌ చెంపదెబ్బ కొట్టింది. మిగతా ప్రయాణికులు ప్రశ్నించగా సదరు కండక్టర్‌ వారిని కూడా కన్నడలో తిట్టడం ప్రారంభించింది. కుండల్‌ నుంచి హుబ్లీకి వెళ్లున్న కర్ణాటక ఆర్జీసీ బస్సులో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వృద్ధురాలిని చెంపదెబ్బ కొట్టిన కండక్టర్‌కు షోకాజ్ నోటీస్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రభుత్వం బస్సు డ్రైవర్లు, కండక్టర్లను హెచ్చరించింది. ప్రతి బస్టాప్ వద్ద బస్సులను నిలపాలని, బస్సుల్లో మహిళా ప్రయాణికులను ఎక్కించుకోవాలని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!