Secunderabad Trains Cancelled Today: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. నేడు సికింద్రాబాద్‌ నుంచి పలు రైళ్లు రద్దు!

భద్రతాపరమైన పనుల కారణంగా ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఈ రోజు (సోమవారం) పలు రైళ్ల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ప్రయాణించే రైల్వే ప్రయానికులకు..

Secunderabad Trains Cancelled Today: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. నేడు సికింద్రాబాద్‌ నుంచి పలు రైళ్లు రద్దు!
Cancelled Trains Today
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2023 | 8:03 AM

హైదరాబాద్‌: భద్రతాపరమైన పనుల కారణంగా ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఈ రోజు (సోమవారం) పలు రైళ్ల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ప్రయాణించే రైల్వే ప్రయానికులకు తెలియజేస్తూ వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎకె త్రిపాఠి ఆదివారం (జూన్ 25) ప్రకటన వెలువరించారు. ఖరగ్‌పూర్‌-భద్రక్‌ సెక్షన్‌లో బహనగా బజార్‌స్టేషన్‌ వద్ద ట్రాక్‌ నిర్వహణ పనులు జరుగుతున్నాయి. దీంతో సుమారు 10 రైళ్ల సర్వీసులను రైల్వే విభాగం అధికారులు రద్దు చేశారు.

సోమవారం రద్దైన రైళ్ల వివరాలు ఇవే..

  • షాలిమార్‌-హైదరాబాద్‌ (18045)
  • హైదరాబాద్‌-షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌
  • సంత్రాగచ్చి-తాంబరం (22841)
  • సికింద్రాబాద్‌-డిబ్రూగఢ్‌ (07046)
  • సికింద్రాబాద్‌-అగర్తలా (07030)
  • తిరుపతి-సంత్రాగచ్చి (22856)
  • ఎర్నాకుళం-హావ్‌డా (22878)
  • హావ్‌డా-ఎస్‌ఎంవీ బెంగళూరు (22863)
  • ఎస్‌ఎంవీ బెంగళూరు-హావ్‌డా (22864)
  • అగర్తలా-ఎస్‌ఎంవీ బెంగళూరు (00636)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.