Telangana Schools Bandh: నేడు తెలంగాణలో పాఠశాలలు బంద్! కారణం ఇదే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాఠశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి సంఘం (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ..

Telangana Schools Bandh: నేడు తెలంగాణలో పాఠశాలలు బంద్! కారణం ఇదే..
Telangana Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2023 | 11:44 AM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాఠశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి సంఘం (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ‘మన ఊరు మన బడి’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామనన్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫారాలు ఇంకా అందలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ తెలిపారు.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఎంఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో సరైన ఫీజుల అమలుకు ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు జరిగే రాష్ట్ర వ్యాప్త పాఠశాలల సమ్మెకు విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..