విషాదం.. ఎనిమిది నెలల గర్భవతిని తుపాకీతో కాల్చిన రెండేళ్ల కొడుకు

అమెరికాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న తన తల్లిని రెండేళ్ల కొడుకు ప్రమాదవశాత్తు తుపాకీతో కాల్చాడు. దీంతో గర్భంలోని శిశువుతోసహా మహిళ మృతి చెందింది. బొమ్మ తుపాకీగా భావించి అసలైన తుపాకీతో కాల్చడంతో ఈ దుర్ఘటన..

విషాదం.. ఎనిమిది నెలల గర్భవతిని తుపాకీతో కాల్చిన రెండేళ్ల కొడుకు
Pregnant Woman Died By Gun Shot
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2023 | 10:04 AM

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న తన తల్లిని రెండేళ్ల కొడుకు ప్రమాదవశాత్తు తుపాకీతో కాల్చాడు. దీంతో గర్భంలోని శిశువుతోసహా మహిళ మృతి చెందింది. బొమ్మ తుపాకీగా భావించి అసలైన తుపాకీతో కాల్చడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో గత శుక్రవారం (జూన్‌ 16) జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అమెరికాలోని ఒహియోలో లారా ఇల్గ్ అనే 32 ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఉంటోంది. ఈ జంటకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. రెండోసారి గర్భందాల్చిన లారా ఎనిమిది నెలల గర్భవతి. భర్త ఉద్యోగానికి వెళ్లగా కొడుకుతో ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం బాలుడు తండ్రి డ్రాయర్‌ నుంచి తుపాకీ తీసి ఆడుకుంటున్నాడు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఇంటి పనుల్లో నిమగ్నమైన తల్లి లారాను వెనుక నుండి కాల్చాడు.

కిందపడిపోయిన లారా వెంటనే తన భర్తకు ఫోన్‌ చేసింది. అలాగే ఎమర్జెన్సీ విభాగానికి ఫోన్ చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండేళ్ల బాలుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బొమ్మ తుపాకీ అనుకుని తన కొడుకు తనను కాల్చాడని బాధితురాలు పోలీసులకు వివరించింది. అనంతరం ఆమెను ఆసుత్రికి తరలిస్తుండగా కడుపులో బిడ్డతో సహా మార్గమధ్యలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేపట్టినట్లు నార్వాక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ మీడియాకు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది