కన్నతల్లి దాష్టికం: పురిటి బిడ్డల్ని గొంతుకోసి చంపి.. ఆపై ఏళ్లతరబడి ఫ్రిజ్‌లో దాచి ఎరగనట్టు నాటకాలు..!

దక్షిణ కొరియాలో ఓ మహిళ తనకు పుట్టిన ఇద్దరు పిల్లలను పుట్టిన కొన్ని రోజులకే గొంతుకోసి చంపి ఫ్రిజ్‌లో దాచేసింది. ఇలా ఏళ్ల తరబడి ప్రిజ్‌లో భద్రపరిచింది. అనుమానంతో అధికారులు సదరు మహిళ ఇంట్లో సోదాలు చేయడంతో..

కన్నతల్లి దాష్టికం: పురిటి బిడ్డల్ని గొంతుకోసి చంపి.. ఆపై ఏళ్లతరబడి ఫ్రిజ్‌లో దాచి ఎరగనట్టు నాటకాలు..!
Woman Kills Her 2 Newborns
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 24, 2023 | 10:03 AM

సీయోల్‌: దక్షిణ కొరియాలో ఓ మహిళ తనకు పుట్టిన ఇద్దరు పిల్లలను పుట్టిన కొన్ని రోజులకే గొంతుకోసి చంపి ఫ్రిజ్‌లో దాచేసింది. ఇలా ఏళ్ల తరబడి ప్రిజ్‌లో భద్రపరిచింది. అనుమానంతో అధికారులు సదరు మహిళ ఇంట్లో సోదాలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అసలేం జరిగిందంటే.. దక్షణి కొరియాలోని సువాన్ నగరానికి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2018లో ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే చంపి ఫ్రిజ్‌లో దాచి పెట్టింది. 2019లో మరో ఆడశిశువు పుట్టగానే గొంతుకోసి హత్య చేసింది. ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు ఉన్నా.. పిల్లల పేర్లు మాత్రం నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ ఏడాది మే నెలలో అధికారులు ఆరా తీయగా.. ఈ దారుణ విషయం బయటపడింది.

అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సెర్చ్ వారెంట్‌తో వచ్చిన పోలీసులు సదరు మహిళ ఇంట్లో సోదాలు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. తొలుత తనకేం తెలియదని బుకాయించినా.. తర్వాత విచారణలో పిల్లలను తానే చంపినట్లు మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేయవలసి వచ్చిందని, ఈ హత్యల గురించి తన భర్తకు తెలియదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయమై ఆమె భర్తను ప్రశ్నించగా.. తాను రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నట్లు తనతో చెప్పినట్లు భర్త తెలిపాడు.

కాగా 2022లో సరిగ్గా ఇలాంటి కేసే దక్షిణ కొరియా జియోంగ్గి ప్రావిన్స్‌లో వెలుగుచూసింది. 15 నెలల కూతురు చనిపోయిన తర్వాత శిశువు మృతదేహాన్ని మూడు సంవత్సరాల పాటు కంటైనర్‌లో దాచిపెట్టినందుకు ఓ జంటను దక్షిణ కొరియా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే