AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్లో అలర్ట్: అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. 8 జిల్లాలకు భారీ వర్ష సూచన

శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు చెరువులను..

ఎల్లో అలర్ట్: అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. 8 జిల్లాలకు భారీ వర్ష సూచన
TS Monsoon Weather Report
Srilakshmi C
|

Updated on: Jun 24, 2023 | 10:37 AM

Share

హైదరాబాద్‌: శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే 040-29555500 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రమంతటా వ్యాపించడంతో నెమ్మదిగా వాతావరణం చల్లబడుతోంది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో కొంత భాగం వ్యాపించాయి. ఆదివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ  రాష్ట్రంలోని 8 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. మరో ఏడు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!