AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌ కేసులో బిగ్ అప్‌డేట్.. ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్ అరెస్ట్..

తీగలాగితో డొంకంతా కదులుతోంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో అరెస్టు పర్వం కొనసాగుతోంది. మాస్‌ కాపీయింగ్‌ కేసులో మరో వ్యక్తి అరెస్టయ్యారు. ఈ కేసులో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్‌ మహబూబ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌ కేసులో బిగ్ అప్‌డేట్.. ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్ అరెస్ట్..
Tspsc
Shiva Prajapati
|

Updated on: Jun 24, 2023 | 10:00 AM

Share

తీగలాగితో డొంకంతా కదులుతోంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో అరెస్టు పర్వం కొనసాగుతోంది. మాస్‌ కాపీయింగ్‌ కేసులో మరో వ్యక్తి అరెస్టయ్యారు. ఈ కేసులో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్‌ మహబూబ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 52కి చేరింది. మహబూబ్‌కు చెందిన కళాశాల నుంచే మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. పరీక్షకు గైర్హాజరైన అభ్యర్థుల క్వశ్చన్ పేపర్‌ని మహబూబ్ వాట్సాప్‌లో షేర్ చేసినట్లు విచారణలో గుర్తించారు అధికారులు.

ఈ క్వశ్చన్ పేపర్‌ని డీఈ పూల రమేష్‌కు షేర్ చేసినట్లు గుర్తించారు. ఇందుకోసం మహబూబ్ 16లక్షలు తీసుకున్నట్లు నిర్ధారించారు సిట్ అధికారులు. మహబూబ్ తన కాలేజీ నుంచే డీఈ పూల రమేష్‌కి పేపర్‌ను వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఇక రమేష్ ఆ పేపర్‌ను మరో 30మందికి పంపాడు. వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పూల రమేష్ హైటెక్ రీతిలో మాస్ కాపీయింగ్‌లకు తెర‌లేపారు. ఏఈ పేపర్‌ను లీక్ చేయడం ద్వారా రూ. 10 కోట్లు సంపాదించాలని రమేష్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు గుర్తించారు విచారణాధికారులు. అప్పటికే అభ్యర్థుల నుంచి కోటిన్నరకు పైగా పూల రమేష్ అడ్వాన్స్ రూపంలో తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి