Telangana BJP: టీబీజేపీలో ఏం జరగుతోంది.. ఈటల, రాజగోపాల్ రెడ్డి.. మధ్యలో కిషన్ రెడ్డి.. అధిష్టానం పిలుపుతో..
Telangana BJP: నేతల మధ్య కొరవడిన సమన్వయం.. మరోవైపు అసమ్మతి.. వారు ఉంటారా..? బయటకు వెళ్లి పోతారా..? తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతుంది.. ఈ ప్రశ్నల మధ్య తెలంగాణ పాలిటిక్స్ హస్తినకు చేరాయి.
Telangana BJP: నేతల మధ్య కొరవడిన సమన్వయం.. మరోవైపు అసమ్మతి.. వారు ఉంటారా..? బయటకు వెళ్లి పోతారా..? తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతుంది.. ఈ ప్రశ్నల మధ్య తెలంగాణ పాలిటిక్స్ హస్తినకు చేరాయి. బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపువచ్చింది.. ఇవాళ మధ్యాహ్నం వారిద్దరూ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా అర్జెంటుగా రావాలంటూ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది.. దీంతో ఆయన హుటాహుటినా ఢిల్లీకి బయలుదేరారు. ఈ ముగ్గురు నేతలూ కూడా శనివారం సాయంత్రం అమిత్‌షా, నడ్డాతో భేటీ కానున్నారు.
అయితే, కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఈటల, రాజగోపాలరెడ్డి సహా పలువురు సీనియర్లు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిని బీజేపీ అగ్రనాయకత్వం ప్రారంభించింది. తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్యపోరుకు చెక్ పెట్టాలని జాతీయ నాయకత్వం సంకల్పించి.. ఈటల, రాజగోపాలరెడ్డిలను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరితోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధిష్టానం పిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర నాయకత్వంలో చాలా మంది నేతలున్నప్పటికీ.. ఈటల, రాజగోపాల్ రెడ్డి తో సమావేశంలో కిషన్ సయోధ్య కుదిర్చేలా ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది. అటు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర నాయకత్వంలో కీలక వ్యవహరిస్తుండటంతో.. హైకమాండ్ కిషన్ నే రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి పార్టీ వ్యవహారాలు సెట్ చేసే పనిలో కాషాయ పార్టీ హై కమాండ్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని పార్టీ కార్యక్రమాల కోసమే కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ.. అదేం కాదని టీబీజేపీని సెట్ చేసేందుకే పిలిచినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ వెళ్లే ముందు.. రాజగోపాల్ రెడ్డితో ఇప్పుడే మాట్లాడానని.. ఆయన మధ్యాహ్నం ఫ్లైట్ కి బయల్దేరి వస్తున్నట్టు చెప్పారని కిషన్ తెలిపారు. అయితే, రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దలు ఏం చెప్పబోతున్నారు..? ఈటల, రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు ఇస్తారా..? కిషన్ రెడ్డికి ఏమైనా కొత్త బాధ్యతలు అప్పగిస్తారా..? ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అధిష్ఠానానికి ఏం చెప్పారు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. జరుగుతున్న పరిణామాలు.. తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పును తీసువస్తాయి.. అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..