భారీ వర్షాలు.. ఈ నెల 28 వరకు స్కూళ్లకు సెలవులు.. 12వ తరగతి వరకు నో స్కూల్!

కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో అవస్థలుపడిన ప్రజలకు ఊరట కలిగినట్లైంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన..

భారీ వర్షాలు.. ఈ నెల 28 వరకు స్కూళ్లకు సెలవులు.. 12వ తరగతి వరకు నో స్కూల్!
Heavy Rasins
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2023 | 11:18 AM

న్యూఢిల్లీ: కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో అవస్థలుపడిన ప్రజలకు ఊరట కలిగినట్లైంది. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌లలో భారీ వర్షపాతం నమోదయింది. ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో వచ్చే 2 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లోని ఫరూఖ్‌ నగర్‌, కోసాలి, మహేందర్‌గఢ్‌, సొహానా, రెవారి, నార్నౌల్‌, బావల్‌, భివారి, తిజారా, ఖైర్తాల్‌, కోట్‌పుట్లీ, ఆల్వార్‌, విరాట్‌నగర్‌, లక్ష్మాగఢ్‌, రాజ్‌గఢ్‌, నబ్దాయ్‌, భరత్‌పూర్‌, మహావా, బయానా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

బీహార్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్‌ రాజధాని పట్నాలో బాణుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులతో ఆ రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో అధికారులు అన్ని పాఠశాలలకు సెలవులు జూన్‌ 28 వరకు ప్రకటించారు. 12వ తరగతి వరకు తరగతులు నిర్వహించడానికి వీల్లేదని జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ శనివారం ఆదేశించారు. ఇప్పటికే ఈ నెల 24 సెలవులు ప్రకటించిన బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎండ వేడిమి తగ్గకపోవడంతో మరో నాలుగు రోజులు స్కూళ్లకు సెలవులిస్తూ ప్రకటన వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..