Guntur Karam: మళ్ళీ బరిలోకి దిగిన ‘గుంటూరు కారం’ చిత్ర బృందం.. పట్టాలెక్కిన చిత్రీకరణ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ‘గుంటూరు కారం’ మువీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై..

Guntur Karam: మళ్ళీ బరిలోకి దిగిన 'గుంటూరు కారం' చిత్ర బృందం.. పట్టాలెక్కిన చిత్రీకరణ
Guntur Karam
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2023 | 8:24 AM

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ‘గుంటూరు కారం’ మువీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్న మువీ ఇది. ఈ మువీలో మహేష్‌ సరసన శ్రీలీల అలరించనుంది. మరో కథానాయికగా పూజా హెగ్డేను చిత్రబృందం ప్రకటించినప్పటికీ.. ఈ మధ్య పూజాహెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ స్థానంలో మరొక కథానాయిక ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక తాజాగా వచ్చిన ఫస్ట్‌ గ్లింప్స్‌తో ఈ మువీపై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్‌ తొలి వారం వరకూ చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. చిత్రీకరణకు చిత్ర బృందం మళ్లీ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ శివార్లలో శనివారం కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైంది. కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా మహేశ్‌కి ‘గుంటూరు కారం’ 28వ సినిమా. మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఐతే ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైనప్పటి నుంచి పలు అవాంతరాలు ఎదురయ్యాయి. కొన్ని నెలల విరామం తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. మహేష్‌ 29వ చిత్రం అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ మువీకి స్క్రిప్ట్‌ రాస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా జక్కన్న ఈ మువీని రూపొందిస్తున్నట్లు టాక్‌.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి