Pawan Kalyan: ఓజీపై హైప్ పెంచేస్తోన్న చిత్ర యూనిట్.. పవన్ కళ్యాణ్ తండ్రిగా బిగ్ బీ? తొలిసారిగా పవన్ అలా కనిపించనున్నారట..

ఈ సినిమాపై అంచనాలు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పుకారు ఒకటి సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రను పోషించడానికి 'OG' బృందం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. అంటున్నారు.

Pawan Kalyan: ఓజీపై హైప్ పెంచేస్తోన్న చిత్ర యూనిట్.. పవన్ కళ్యాణ్ తండ్రిగా బిగ్ బీ? తొలిసారిగా పవన్ అలా కనిపించనున్నారట..
Pawan Big B
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2023 | 8:51 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు వరస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు జనసేన అధినేతగా ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజల మధ్య ఉంటూ సందడి చేస్తున్నారు. ఓ వైపు సినీ హీరోగా, మరోవైపు రాజకీయ నేతగా కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు. కోనసీమలో వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ .. సినిమాల విషయాన్ని వస్తే.. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో OG సినిమా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై అంచనాలు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పుకారు ఒకటి సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రను పోషించడానికి ‘OG’ బృందం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. అంటున్నారు. మరి ఈ  వార్తల్లో ఎంత వరకూ నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ ప్రకటించాల్సిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో పుకారు కూడా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. పవన్ స్టైలిష్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నాడట. అంతేకాదు పవన్ కళ్యాణ్ తొలిసారిగా డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు.. ఒక పాత్ర  పేరు గాంధీ.. కాగా మరో పాత్ర పేరు ఓజాస్ గంభీర్ అలియాస్ (OG) అని టాక్ వినిపిస్తోంది. మొదటిసారిగా పవన్ కళ్యాణ్ డబుల్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడనే టాక్ తో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ చిత్రంలో  పవన్ కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా.. ఓజీ కి అన్నయ్యగా కిక్ శ్యామ్.. వదిన గా శ్రీయ రెడ్డి నటిస్తున్నారు. విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో సెట్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ కానున్నారు. ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..