కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు..!

టాలీవుడ్‌ సంచలనంగా మారిన డ్రగ్స్‌ కేసులో రోజుకో మలుపుతిరుగుతోంది. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన కబాలి తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి (కేపీ చౌదరి)తోపాటు పలువురు సెలబ్రెటీలకు పోలీసులు నోటీసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు..

కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు..!
KP Chowdary Drugs Case
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2023 | 7:12 AM

టాలీవుడ్‌ సంచలనంగా మారిన డ్రగ్స్‌ కేసులో రోజుకో మలుపుతిరుగుతోంది. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన కబాలి తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి (కేపీ చౌదరి)తోపాటు పలువురు సెలబ్రెటీలకు పోలీసులు నోటీసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ లిస్టులో పలువురు సినీ సెలబ్రెటీలు, క్రీడాకారులు, వైద్యులు, వ్యాపారస్థులు కూడా ఉన్నారు. వీరందరికీ కొకైన్‌ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో ఆయా వర్గాల్లో అలజడి మొదలైంది.

ఇందుకు సంబంధించిన లావాదేవీలు, డ్రగ్స్‌ కొన్నవారి లిస్టు, బ్యాంకు లావాదేవీలు, ఫోన్‌ సంభాషణలు, వాట్సాప్‌ చాటింగ్‌లు, డ్రగ్స్‌ పార్టీల ఫొటోలను నిందితుడు కేపీ చౌదరి తన గూగుల్‌ డ్రైవ్‌లో భద్రపరుచుకున్నాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా వాటన్నింటినీ వెలికితీశారు. నిజానిజాలను బయటపెట్టాలంటే సదరు సదరు సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులను పూర్తి స్థాయిలో విచారించవల్సి ఉంటుంది. దీనిలో భాగంగా వారందరికీ నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు.

కాగా జూన్‌ 14న కబాలీ నిర్మాత కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 100 గ్రాముల కొకైన్‌ తీసుకువచ్చాడు. అందులో 12 గ్రాముల కొకైన్‌ను విక్రయించినట్లు కేపీ చౌదరి పోలీసులకు తెలిపాడు. ఐతే దానిని ఎవరికి అమ్మాడనేది మాత్రం నిందితుడు బయటపెట్టడం లేదు. దీనిని తేల్చడంపై పోలీసులు దృష్టిపెట్టారు. మిగతా 88 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి