- Telugu News Photo Gallery Cinema photos Actress Sonali Bendre Shares Her Recent Photos On Social Media Goes Viral
Sonali Bendre: 50కు దగ్గరవుతున్నా వన్నె తగ్గని అందం.. సోనాలి బింద్రే లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
013లో సినీ పరిశ్రమకు దూరమైన సోనాలి ఆ తర్వాత కేవలం రెండు సినిమాల్లోనే మాత్రమే కనిపించింది. అందం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే సోనాలి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది.
Updated on: Jun 24, 2023 | 9:52 PM

ఒకప్పుడు దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది సోనాలి బింద్రే. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన నటించిందామె.

అయితే ఆ మధ్యన క్యాన్సర్ బారిన పడింది ఈ ముద్దుగుమ్మ. 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను ఎదుర్కొన్న ఈ అందాల తార చికిత్స తీసుకుని మహమ్మారిని జయించింది.

2013లో సినీ పరిశ్రమకు దూరమైన సోనాలి ఆ తర్వాత కేవలం రెండు సినిమాల్లోనే మాత్రమే కనిపించింది. అందం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే సోనాలి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది.

ఈక్రమంలో సోనాలి బింద్రే షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం సోనాలి వయసు 48 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు.

కాగా ప్రముఖ దర్శకనిర్మాత రచయిత గోల్డీ బెహెల్ ను పెళ్లాడింది సోనాలి బింద్రే. ఈ దంపతులకు రణవీర్ అనే కుమారుడు ఉన్నారు.





























